బాలీవుడ్‌ భామ మృణాల్‌ ఠాకూర్‌ను(Mrunal thakur) తెలుగమ్మాయిగా భావిస్తుంటారు చాలా మంది! సీతారామం సినిమాతో మృణాల్‌ ఠాకూర్‌ ఆ ఇమేజ్‌ను తెచ్చుకున్నారు. ఆ సినిమాలో నిజంగానే తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తారు. ఇటీవల తమన్నా భాటియా, విజయ్‌వర్మ కలిసి నటించిన లస్ట్‌ స్టోరీస్‌-2(Lust stories) వెబ్‌ సిరీస్‌లో కూడా మృణాల్‌ నటించారు.

బాలీవుడ్‌ భామ మృణాల్‌ ఠాకూర్‌ను(Mrunal thakur) తెలుగమ్మాయిగా భావిస్తుంటారు చాలా మంది! సీతారామం సినిమాతో మృణాల్‌ ఠాకూర్‌ ఆ ఇమేజ్‌ను తెచ్చుకున్నారు. ఆ సినిమాలో నిజంగానే తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తారు. ఇటీవల తమన్నా భాటియా, విజయ్‌వర్మ కలిసి నటించిన లస్ట్‌ స్టోరీస్‌-2(Lust stories) వెబ్‌ సిరీస్‌లో కూడా మృణాల్‌ నటించారు. ప్రస్తుతం ఆమెకు బంపరాఫర్‌ లభించింది. తమిళ స్టార్‌ హీరోతో జతకట్టే అవకశం లభించింది. ఇటీవలే మావీరన్‌ సినిమాతో హిట్‌ కొట్టిన శివ కార్తికేయన్‌కు(shiva karthikeyan) జంటగా మృణాల్‌ నటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మావీరన్‌ విజయం తర్వాత శివ కార్తికేయన్‌ ఇప్పుడు కొత్త సినిమాకు ఓకే చెప్పారు. ఎ.ఆర్‌.మురుగదాస్‌(A.R Murugadhas) దర్శకత్వంలో వస్తున్న సినిమాలో శివ కార్తికేయన్‌ హీరోగా నటిస్తున్నారు. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే శివ కార్తికేయన్ ప్రస్తుతం రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై కమలహాసన్‌ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా కనిపించనుంది. దీనికి రాజ్‌కుమార్‌ పెరియ సామి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో మేజర్‌గా శివకార్తికేయన్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మురుగదాస్‌ సినిమాలో శివ కార్తికేయన్‌ మరోసారి పోలీసు అధికారిగా నటించబోతున్నారు. ఇంతకు ముందు కాక్కీసట్టై సినిమాలో పోలీసు అధికారిగా నటించారు. మురుగదాస్‌ చివరగా దర్శకత్వం వహించిన దర్బార్‌. ఇందులో రజనీకాంత్‌ పోలీసు అధికారిగా నటించారు. కాకపోతే ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత మురగదాస్‌ చాలా గ్యాప్‌ తీసుకున్నారు. ఇన్నాళ్లకు మళ్లీ పోలీస్ కథనే నమ్ముకుని సినిమా తీయడానికి మురుగదాస్‌ రెడీ అవుతున్నారు. స్పైడర్‌ను తీసిన ప్రొడ్యుసర్లే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Updated On 23 Aug 2023 7:54 AM GMT
Ehatv

Ehatv

Next Story