అయిదేళ్ల కిందట నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన లస్ట్ స్టోరీస్(Lust Stories) మంచి విజయం సాధించింది. ప్రేక్షకాదరణ పొందిన ఆ ఆంథాలజీ సిరీస్(anthology series)కు కొనసాగింపుగా లస్ట్ స్టోరీస్ 2(Lust Stories 2)ను తెరకెక్కించారు. గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పటికే ట్రైలర్ యూత్‌ను బాగా అట్రాక్ట్ చేసింది. తమన్నా(Tamanna), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), కాజోల్(Kajol), నీనా గుప్తా(Neena Gupta)వంటి వారు నటించడంతో ఈ సిరీస్‌పై ఆసక్తి పెరిగింది.

Mrunal Thakur
అయిదేళ్ల కిందట నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన లస్ట్ స్టోరీస్(Lust Stories) మంచి విజయం సాధించింది. ప్రేక్షకాదరణ పొందిన ఆ ఆంథాలజీ సిరీస్(anthology series)కు కొనసాగింపుగా లస్ట్ స్టోరీస్ 2(Lust Stories 2)ను తెరకెక్కించారు. గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పటికే ట్రైలర్ యూత్‌ను బాగా అట్రాక్ట్ చేసింది. తమన్నా(Tamanna), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), కాజోల్(Kajol), నీనా గుప్తా(Neena Gupta) వంటి వారు నటించడంతో ఈ సిరీస్‌పై ఆసక్తి పెరిగింది. మొదటి కథలో వేద (మృణాల్ ఠాకూర్) అర్జున్ (అంగద్ బేడీ) పెళ్లి చేసుకోవాలనుకుంటారు. రెండు కుటుంబాలు వీరి పెళ్లి గురించి చర్చిస్తుంటారు. అదే సమయంలో వేద బామ్మ (నీనా గుప్తా) మధ్యలో కలగజేసుకుని యువ జంట జీవితాంతం సుఖంగా ఉండాలటే పెళ్లికి ముందు శృంగార జీవితాన్ని రుచి చూడాలన సలహా ఇస్తుంది. తాజాగా ఈ సిరీస్ గురించి మృణాల్ ఠాకూర్ తన అభిప్రాయాలను చెప్పారు. శృంగారం, కామం గురించి మెచ్యూరిటీతో కూడిన చర్చ చేయడంలో తప్పులేదన్నారు. 'ఈ రోజుల్లో శృంగారం, కామం గురించి ప్రతి ఇంట్లో ఓపెన్‌గా మాట్లాడటం ఎంతో ముఖ్యమని నేను బలంగా నమ్ముతాను. ముఖ్యంగా ఇంట్లో యుక్త వయసులో ఉన్నవాళ్లతో దీనిపై మాట్లాడటం ఎంతో అవసరం. వారికి వీటి గురించి సరైన సమాచారం అందించే ఓ రోల్ మోడల్ అవసరం. ఇలాంటి అంశాలపై ఇంట్లోని పిల్లలకు నిజాయితీగా వివరించే ఒక్క వ్యక్తి ఉన్నా కూడా వారు బయట నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని స్వీకరించరు' అని సీతారామం ఫేమ్ మృణాల్ చెప్పారు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ దర్శకుడు పరశురామ్ రూపొందిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరో విజయ్ దేవరకొండ. మరోవైపు నానితో కూడా ఓ సినిమాలో నటిస్తున్నారు.
