సీతారామం(Sitha Ramam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ఆ సినిమా ఘన విజయం సాధించడంతో వరుస ఆఫర్లు ఆమెను వరించాయి. ఇప్పటికే నాచురల్ స్టార్ నాని(Nani) హీరోగా నటిస్తున్న హాయ్‌నాన్న(Hi Nana) చిత్రంలో, విజయ్ దేవరకొండ(Vijay Devarkonda) కథనాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు.

Mrunal Thakur In Raviteja Movie
సీతారామం(Sitha Ramam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ఆ సినిమా ఘన విజయం సాధించడంతో వరుస ఆఫర్లు ఆమెను వరించాయి. ఇప్పటికే నాచురల్ స్టార్ నాని(Nani) హీరోగా నటిస్తున్న హాయ్‌నాన్న(Hi Nana) చిత్రంలో, విజయ్ దేవరకొండ(Vijay Devarkonda) కథనాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. విజయ్ దేవరకొండ సినిమాకు ఫ్యామిలీస్టార్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు కానీ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇక ఈ రెండు సినిమాలు కాకుండా మృణాల్ ఠాకూర్‌కు మరో సినిమా ఛాన్స్ కూడా వచ్చింది.
డాన్ శీను, బలుపు, క్రాక్ చిత్రాల తర్వాత హీరో రవితేజ(Ravi teja), దర్శకుడు గోపీచంద్ మలినేని(Gopichand Mallineni) కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మొదట పూజా హెగ్డేను(Pooja Hegde) అనుకున్నారు. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. పూజా హెగ్డే సినిమా నుంచి తప్పుకున్నారా? లేక కాల్షీట్లు కుదరక సినిమా చేయడం లేదా ? అన్నది ఇంకా తెలియదు. మేకర్స్ నుంచి దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి రవితేజ సరసన పూజా హెగ్డే నటిస్తారా? లేక మృణాల్ ఠాకూర్ నటిస్తారా అన్నది తెలియాలటే కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, వై. రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
