దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని ఆలోచిస్తోంది మృణాల్ ఠాకూర్.. మంచి ఫామ్ లో ఉండగానే సంపాదించుకోవాలి అని చూస్తుంది. అందుకే ఫామ్ లో ఉండగానే తన రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వస్తోంది. అంతకు ముందు కూడా కాస్త రేట్ పెంచిన తార..ఇప్పడు ఇంకాస్త ఎక్కువే పెంచిదంట. ఇంతకీ ఆమె ఎంత తీసుకుంటుంది. ఎంత డిమాండ్ చేస్తుందిచూస్తే...?
వరుస అవకాశాలు రావడం... ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరగడం బాగా కాలిసొచ్చింది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కు. అందుకే రెమ్యూనరేషన్(Remuneration) భారీగా పంచేసిందట. ఇంతకీ ఎంత డిమాండ్ చేస్తుందంటే..?
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని ఆలోచిస్తోంది మృణాల్ ఠాకూర్.. మంచి ఫామ్ లో ఉండగానే సంపాదించుకోవాలి అని చూస్తుంది. అందుకే ఫామ్ లో ఉండగానే తన రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వస్తోంది. అంతకు ముందు కూడా కాస్త రేట్ పెంచిన తార..ఇప్పడు ఇంకాస్త ఎక్కువే పెంచిదంట. ఇంతకీ ఆమె ఎంత తీసుకుంటుంది. ఎంత డిమాండ్ చేస్తుందిచూస్తే...?
అవకాశాలు వస్తున్నప్పుడే సందపాదించేసుకోవాలి.. అన్న ఫార్ములాను బాగా ఫాలో అవుతుంది మృణాల్. ప్రస్తుతం అదే పనిలో ఉంది. వరుసగా ఆఫర్లు వస్తున్నా.. ఆచితూచి అడుగులు వేస్తుంది. సినిమాల(Movies) విషయంలో జాగ్రతత్గా అడుగులు వేస్తోంది. ఇక దానికి తోడు తాజాగా ఆమె తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందట.
క్రేజు.. ఇమేజు ను బట్టి రేటు ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ లో దూసుకుపోతోంది మృణాల్ ఠాకూర్. దీంతో ఈ భామ రెమ్యూనరేషన్ కూడా అలానే పెంచేసిందంట. గతంలో ఒక్కో సినిమాను కోటి లోపే తీసుకునే ఈబ్యూటీ ఇప్పుడు ఏకంగా రెండు నుంచి మూడు కోట్లు డిమాండ్ చేస్తున్నదని తెలిసింది.సీతారామం(Sita Ramam) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్.. సీత పాత్రలో జీవించేసింది. తెలుగు ప్రేక్షకులు మనసుల్లోఅలా నిలిచిపోయింది. ఇక వరుసగా ఆఫర్లు ఆమె గుమ్మం ముందుకు వచ్చి చేరాయి.. ప్రస్తుతం నానీ 30వ(NANI 30) సినిమాలో నటిస్తోంది బ్యూటీ..
అంతే కాదు ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన(Vijay devarkonda) మెరుపులు మెరిపించబోతోంది. గీతగోవింద (Geetha Govindham)మూవీ కాంబో రిపీట్ కాబోతోంది. విజయ్ తో పరశురామ్ సినిమా తాజాగా స్టార్ట్ అయ్యింది. ఇక ఈసినిమాలో రౌడీ మీరో జతగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. దాంతో ఈబ్యూటీ ఈసినిమాతోనే తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసినట్టు తెలుస్తోంది. ముందు ముందు మృణాల్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి మరి.