తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు కొదవలేదు. తామరతంపరగా వస్తున్నారు. అందులో నిలదొక్కుకునేవాళ్లు మాత్రం చాలా తక్కువ. అలాంటి వారిలో ముంబాయి బ్యూటీ మృణాళ్ ఠాకుర్(Mrunal Thakkur) ఒకరు. తెలుగులో నటించిన మొదటి సినిమా సీతారామంతోనే(Sita Ramam) ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత హాయ్‌నాన్న(Hi Nana), ఫ్యామిలీస్టార్(Family Star) వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు కొదవలేదు. తామరతంపరగా వస్తున్నారు. అందులో నిలదొక్కుకునేవాళ్లు మాత్రం చాలా తక్కువ. అలాంటి వారిలో ముంబాయి బ్యూటీ మృణాళ్ ఠాకుర్(Mrunal Thakkur) ఒకరు. తెలుగులో నటించిన మొదటి సినిమా సీతారామంతోనే(Sita Ramam) ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత హాయ్‌నాన్న(Hi Nana), ఫ్యామిలీస్టార్(Family Star) వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొత్త ప్రాజెక్టుల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న మృణాళ్ ఠాకుర్ లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పారు. రిలేషన్, పిల్లలను కనడం వంటి పలు విషయాలపై కచ్చితమైన అభిప్రాయాలను చెప్పారు. ఆమె ఏమన్నారంటే 'కెరీర్, జీవితం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా అవసరం. రిలేషన్‌షిప్(Relationship) అంటే కష్టమన్న విషయం నాకు కూడా తెలుసు. మనం చేసే ప్రతి పనిని అర్థం చేసుకునేవాడు దొరకాలి. అది చాలా కష్టం. అలాగే ఎగ్ ఫ్రీజింగ్(Egg Freezing) గురించి ఆలోచిస్తున్నాను' అని మృణాళ్ ఠాకుర్ చెప్పుకొచ్చారు. అంటే ఇప్పట్లో ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండరన్నమాట!పెళ్లి కూడా చేసుకోదన్నమాట! కాకపోతే ఆమె ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటో చెప్పుకొచ్చారు.చాలా మంది హీరోయిన్లను ఇది కామన్. ఓ దశ దాటిన తర్వాత నిల్వ చేసిన తమ అండాలతో పిల్లల్ని కనడాన్నే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. వయసులో ఉన్నప్పుడు పిల్లల్ని కంటే కెరీర్ ఇబ్బందుల్లో పడొచ్చనే ఆలోచనతోనే ఈ విధానంపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మృణాల్ ఠాకుర్ కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు.