సీతారామం సినిమాతో తెలుగువారి అభిమానాన్ని చూరగొని, హాయ్ నాన్న సినిమాతో మరింత దగ్గరైన మృణాళ్ ఠాకూర్ ప్రస్తుతం పూజా మేరీ జాన్ అనే హిందీ సినిమాలో మాత్రమే నటిస్తున్నది.
సీతారామం సినిమాతో తెలుగువారి అభిమానాన్ని చూరగొని, హాయ్ నాన్న సినిమాతో మరింత దగ్గరైన మృణాళ్ ఠాకూర్ ప్రస్తుతం పూజా మేరీ జాన్ అనే హిందీ సినిమాలో మాత్రమే నటిస్తున్నది.సీతారామం, హాయ్ నాన్న సినిమాలు రెండూ విజయవంతమైనప్పటికీ తెలుగులో ఆమెకు మంచి అవకాశాలు రాకపోవడం ఆశ్చర్యకరం. హిందీలోనే మరిన్ని సినిమాలకు కమిట్ అయ్యింది. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నాయి. అయితే ఇప్పుడో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898ఏడిలో మృణాల్ ఠాకూర్ ఓ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నదట! కల్కి సినిమాలో ప్రభాస్ భైరవగా నటిస్తున్నాడు. భైరవ తల్లి పాత్రను మృణాళ్ ఠాకూర్ వేసిందట! భైరవ చిన్నప్పటి సన్నివేశాల్లో మృణాళ్ పాత్ర కనిపిస్తుందని అంటున్నారు. గ్లామర్ హీరోయిన్గా అందరి దృష్టిని ఆకర్షించి, కెరీర్ పీక్స్‌లో ఉన్న తరుణంలో ప్రభాస్ తల్లిగా నటించడమేమిటని ఫ్యాన్స్ అంటుంటే, నటనకు స్కోప్ ఉంటే పాత్రను ఒప్పుకోవడమన్నది నిజంగా గ్రేట్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే కల్కి సినిమాలో మృణాళ్ ఠాకూర్ నటిస్తున్నది లేనిది కచ్చితంగా తెలియదు. కల్కి టీమ్ కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. ప్రచార చిత్రాల్లో కూడా ఎక్కడా మృణాళ్ ఠాకూర్ కనిపించలేదు. అయితే సినిమాలో మాత్రం ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని ఇన్సైడ్ టాక్.