సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన ఆరు వారాల తర్వాత ఓటీటీ (OTT)లోకి అడుగుపెడతాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు మాత్రం ఆ డేట్‏ను రీచ్ అవ్వకముందే ఒటీటీలోకి వచ్చేస్తాయి. అయితే ఈవారంలో ఓటీటీల్లోకి మంచి చిత్రాలు, సిరీస్‏లు రాబోతున్నాయి. ఓటీటీల్లోనే కాకుండా థియేటర్లో భారీ బడ్జెట్ సినిమాలు వచ్చేస్తున్నాయి.

సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన ఆరు వారాల తర్వాత ఓటీటీ (OTT)లోకి అడుగుపెడతాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు మాత్రం ఆ డేట్‏ను రీచ్ అవ్వకముందే ఒటీటీలోకి వచ్చేస్తాయి. అయితే ఈవారంలో ఓటీటీల్లోకి మంచి చిత్రాలు, సిరీస్‏లు రాబోతున్నాయి. ఓటీటీల్లోనే కాకుండా థియేటర్లో భారీ బడ్జెట్ సినిమాలు వచ్చేస్తున్నాయి. మే 12 నుంచి విక్రమ్ వేద (VikramVedha) హిందీ సినిమా జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది. ఇక బెన్ అఫ్లెక్ దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా మూవీ ఎయిర్ (Air) అమేజాన్ ప్రైమ్‏లో స్ట్రీమ్ అవుతోంది. ఇకపోతే మే 12 నుంచి అమేజాన్ ప్రైమ్‏లో థ్రిల్లర్ వెబ్ సిరీస్ దహాద్ స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ వారం అమేజాన్ ప్రైమ్‏లో సమంత రూత్ ప్రభు నటించిన శాకుంతలం చిత్రం విడుదలైంది.

ఇక ఆహా ప్లాట్‏ఫామ్‏లో తెలుగు థ్రిల్లర్ సిరీస్ న్యూసెన్స్ రిలీజ్ అయింది. ఇక మే 14న సన్‏నెక్ట్స్‏లో తమిళ, తెలుగు సినిమా రుద్రన్/రుద్రుడు విడుదల కానుంది. ఇకపోతే అమేజాన్‏లో తమిళ సినిమా యాథిసాయ్ విడుదలవనుంది. హాట్‏స్టార్‏లో ఈ వారం సొప్పన సుందరి (Soppana Sundari) మల్టి లాంగ్వేజ్ మూవీ స్ట్రీమవనుంది. మే 19న అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ (Agent) చిత్రం సోనీ లీవ్‏లో స్ట్రీమవనుంది. ఇక అదేరోజు డిస్నీప్లస్ హాట్ స్టార్‏లో డెడ్ పిక్సెల్ రిలీజవుతోంది. ఇక ఆహాలో మే 26న సత్తిగాని రెండెకరాలు, మే 16న నెట్ ఫ్లిక్స్‏లో అన్నా నికోల్ స్మిత్ (Anna Nicole Smith) సిరీస్ అందుబాటులో ఉండనున్నాయి. ఇన్ని సిరీస్‏లు, సినిమాలు ఒకేసారి వీకెండ్‏లో రిలీజ్ అవుతుండటంతో ఏది చూడాలో తెలియని పరిస్థితిలో ఉన్నామంటున్నారు పలువురు సినీ ప్రేమికులు.

Updated On 13 May 2023 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story