సినిమా చెట్టు ప్రాణం పోసుకుంటుంది!
కుమారదేవంలోని(Kum) సినిమా చెట్టు(Cinema tree) నేలకూలిన విషయం తెలిసిందే. ఎన్నో సినిమాలకు ఆయువుపట్టుగా నిలిచిన ఈ చెట్టు కూలిపోవడం అందరినీ బాధించింది. సినిమా వాళ్లు కలత చెందారు. ఈ చెట్టుకు పునర్జీవితాన్ని ఇవ్వాల్సిందేనని అనుకున్నారు. శాస్త్రీయ, ఆధునిక పద్దతులలో జీవం పోస్తున్నారు. ఇందుకోసం ఈనెల 8వ తేదీన పూజా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత చెట్టు వేర్లలోకి రసాయనాలు పంపించారు. ఇక శనివారం ఉదయం నుంచి రెండుగా చీలి పడిపోయిన ప్రధాన కొమ్మలు, అంతర కొమ్మలను కత్తిరించే పనులు చేపట్టారు. కొమ్మ కత్తిరించిన వెంటనే ఆ ప్రదేశంలో మిశ్రమంగా తయారైన రసాయనాలను అద్దుతున్నారు. గాలి, ధూళి తగలకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కొమ్మల తొలగింపు పనులు మరో రెండుమూడు రోజులు జరుగుతాయి. . రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో గ్రీన్‌భారత్ వనం-మనం విభాగం ద్వారా పనులు జరుగుతున్నాయి..