అంతే !నాకుఅన్ని ఆలా తెలిసిపోతాయంతే ! అంటూ .. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అలరించిన అచ్చ తెలుగు ముద్దుగుమ్మ అంజలి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు జోరుగా వినబడుతున్నాయి . అటు తెలుగు తమిళ ఇండస్ట్రీలో అంజలి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ . తెలుగు అమ్మాయి అయినప్పటికీ అంజలి కెరియర్ మొదలైంది మాత్రం తమిళ్ సినిమాతోనే . సహజమైన నటనతో తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకొని వరుస సినిమాలతో […]

అంతే !నాకుఅన్ని ఆలా తెలిసిపోతాయంతే ! అంటూ .. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అలరించిన అచ్చ తెలుగు ముద్దుగుమ్మ అంజలి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు జోరుగా వినబడుతున్నాయి . అటు తెలుగు తమిళ ఇండస్ట్రీలో అంజలి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ .

తెలుగు అమ్మాయి అయినప్పటికీ అంజలి కెరియర్ మొదలైంది మాత్రం తమిళ్ సినిమాతోనే . సహజమైన నటనతో తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకొని వరుస సినిమాలతో బిజీ గ గడుపుతూన్న సమయంలో ఎంగేయుమ్ ఎప్పోదుం సినిమా టైం లో హీరో జై తో ప్రేమాయణం కొనసాగించింది . పెళ్లి వరకు వెళ్లిన వీళ్ళ బంధానికి అనుకోకుండా బ్రేక్ పడింది. దాంతో కొన్నాళ్ళు డిప్రెషన్ లో ఉన్న అంజలి ఆ గ్యాప్ తరువాత తెలుగు సినిమాలతో బిజీ అయింది .

సోషల్ మీడియాలో కూడా అంజలి ఆక్టివ్ గా ఉంటుంది.ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేకపోయినప్పటికీ వెబ్ సిరీస్ ఝాన్సీ తో అలరిస్తుంది. నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఐటెం సాంగ్ తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది . ఈ గ్లామర్ డాల్ జై తర్వాత ఒక దర్శకుడిని వివాహం చేసుకుంటుందని వార్తలు వచ్చాయి వీటిని లైట్ తీసుకుంది అంజలి. తాజాగా అంజలి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంజలి ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న RC 15 లో ఒక కీలక పాత్రను చేయబోతుంది. ఈ సినిమా పూర్తయ్యాక అంజలి పెళ్లి చేసుకుంటుందని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది .

Updated On 15 March 2023 2:16 AM GMT
Ehatv

Ehatv

Next Story