జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr.NTR) అంటే బాలకృష్ణకు(Balakrishna) పడదన్న విషయం బహిరంగ రహస్యమే కదా! ఇద్దరి మధ్య బోల్డంత గ్యాప్‌ ఉందన్న సంగతీ తెలిసిందే! చంద్రబాబు(chnadrababu) అరెస్ట్‌ అయితే ఎన్టీఆర్‌ రియాక్టవ్వలేదన్న కోపం బాలకృష్ణలో చాలా ఉంది. తారక్‌పై ఉద్దేశించి ఐ డోంట్‌ కేర్‌(I Dont care) అని మండిపడ్డాడు బాలయ్య. సొంత అన్నయ్య కొడుకే అయినా తారక్‌ నందమూరి ఫ్యామిలీలో ద్వితీయ శ్రేణి పౌరుడి కిందే లెక్క! ఆ కుటుంబం ఎన్నడూ తారక్‌ను దగ్గర తీసుకున్నది లేదు. ఇప్పుడు ఇద్దరి మధ్య వార్‌ సినిమాల వరకు వెళ్లింది.

జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr.NTR) అంటే బాలకృష్ణకు(Balakrishna) పడదన్న విషయం బహిరంగ రహస్యమే కదా! ఇద్దరి మధ్య బోల్డంత గ్యాప్‌ ఉందన్న సంగతీ తెలిసిందే! చంద్రబాబు(chnadrababu) అరెస్ట్‌ అయితే ఎన్టీఆర్‌ రియాక్టవ్వలేదన్న కోపం బాలకృష్ణలో చాలా ఉంది. తారక్‌పై ఉద్దేశించి ఐ డోంట్‌ కేర్‌(I Dont care) అని మండిపడ్డాడు బాలయ్య. సొంత అన్నయ్య కొడుకే అయినా తారక్‌ నందమూరి ఫ్యామిలీలో ద్వితీయ శ్రేణి పౌరుడి కిందే లెక్క! ఆ కుటుంబం ఎన్నడూ తారక్‌ను దగ్గర తీసుకున్నది లేదు. ఇప్పుడు ఇద్దరి మధ్య వార్‌ సినిమాల వరకు వెళ్లింది. వచ్చే ఏడాది వేసవిలో ఎన్టీఆర్‌ నటించిన దేవర(Devara) సినిమా రిలీజ్‌ కాబోతున్నది. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్టు దర్శకుడు కొరటాల శివ(Koratala shiva) ఎప్పుడో ప్రకటించాడు. ఇదే సమయంలో బాలయ్య నటిస్తున్న ఎన్‌బీకే 109(NBK 109) సినిమా ఓ వారం ముందుగా అంటే మార్చి 29న థియేటర్లలోకి రానుంది. బాబీ(Bobby) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. అంటే తారక్‌, బాలయ్య మధ్య బాక్సాఫీస్‌ వార్‌ నడవడం ఖాయం.

ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ఒకవేళ వారం గ్యాప్‌లో బాలయ్య-తారక్‌ సినిమాలు రిలీజైతే మాత్రం అబ్బాయిదే పైచేయి అవుతందని అంటున్నారు. ఎన్టీఆర్‌కు అభిమానులు ఎక్కువే. పైగా ఇతర హీరోల అభిమానులు కూడా తారక్‌ను లైక్‌ చేస్తారు. అందుకు కారణం హీరోలందరితోనూ ఎన్టీఆర్‌ సన్నిహితంగా ఉండటం. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రామ్‌చరణ్‌తో కలిసి నటించాడు కూడా! ఏమాటకామాట చెప్పుకోవాలి. ప్రస్తుతం నందమూరి హీరోలంటే మొదట వినిపించే పేరు ఎన్టీఆర్‌దే! బాలయ్య-ఎన్టీఆర్‌లు బాక్సాఫీస్‌ దగ్గర పోటీపడటం ఇదేం మొదటిసారి కాదు. 2016లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇద్దరూ పోటీపడ్డారు. నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్‌ వస్తే, డిక్టేటర్‌ చిత్రంతో బాలయ్య వచ్చాడు. జనవరి 13న నాన్నకు ప్రేమతో రిలీజయ్యింది. జనవరి 14న డిక్టేటర్‌ విడుదలయ్యింది. ఆ విధంగా మొదటిసారి ఒకరితో ఒకరు పోటీపడ్డారు. ఆ సమయంలో ఇద్దరి హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధం జోరుగా నడిచింది.
అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నాన్నకు ప్రేమతో సినిమాకు ఎక్కువ థియేటర్లు లేకుండా చూసే ప్రయత్నాలు కూడా జరిగాయి. అప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే! ఆ సంక్రాంతి పోటీలో తారకే విజయం సాధించాడు. నాన్నకు ప్రేమతో హిట్టయితే డిక్టేటర్‌ డిజాస్టర్‌ అయ్యింది.

Updated On 9 Nov 2023 5:40 AM GMT
Ehatv

Ehatv

Next Story