తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరుస విషాదాలతో కూరుకుపోతోంది. లెజెండరీ డైరెక్టర్ కాశీనాథుని విశ్వనాథ్ (92) కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన 1930 ఫిబ్రవరి 19న గుంటూరులోని తెనాలిలో జన్మించారు. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్, పవన్ కల్యాణ్, రాఘవేంద్రరావు, చిరంజీవి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారతీయ సామాజిక సంస్కృతీ సంప్రదాయ విలువలకు ఆయన సినిమాల్లో పెద్దపీట వేశారని కేసీఆర్ […]

Movie and Political celebrities pays tribute to K Viswanath
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరుస విషాదాలతో కూరుకుపోతోంది. లెజెండరీ డైరెక్టర్ కాశీనాథుని విశ్వనాథ్ (92) కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన 1930 ఫిబ్రవరి 19న గుంటూరులోని తెనాలిలో జన్మించారు. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్, పవన్ కల్యాణ్, రాఘవేంద్రరావు, చిరంజీవి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
భారతీయ సామాజిక సంస్కృతీ సంప్రదాయ విలువలకు ఆయన సినిమాల్లో పెద్దపీట వేశారని కేసీఆర్ అన్నారు. దాదా సాహెబ్ ఫాల్కె, రఘుపతి వెంకయ్య వంటి అవార్డులు ఆయన దర్శక ప్రతిభకు కలికి తురాయిగా నిలిచాయని చెప్పారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన పేరు నిలిచే ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కళా తపస్వి కె. విశ్వనాథ్ చేసిన స్వాతిముత్యం, శంకరాభరణం సినిమాలు చాలా ఇష్టమన్నారు పవన్ కల్యాణ్. తెలుగు చిత్ర పరిశ్రమకు మూలస్థంభమైన ఆయన లేకపోవడం దురదృష్టకరమన్నారు. విశ్వనాథ్ గారి సినిమాలన్నీ సంస్కృతి, సంప్రదాయాలను తెలియపరిచేలా ఉంటాయన్నారు.
దిగ్గజ దర్శకులు కె. విశ్వనాథ్ కి ఏకలవ్య శిష్యుడినని రాఘవేంద్రరావు అన్నారు. ఆయన సినిమా వచ్చిందంటే కాలేజీలకు డుమ్మాకొట్టి వెళ్లేవాళ్లమన్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చి.. డైరెక్టర్ అయ్యాక సినిమాల గురించి కళాతపస్వితో డిస్కషన్ చేసేవాడినని తెలిపారు. ఆయన కేవలం సిని పరిశ్రమకే కాకుండా తెలుగు జాతికి పేరు తెచ్చిన వ్యక్తని రాఘవేంద్రరావు కొనియాడారు. సినిమాలను ఆయన వినోదం కోసమే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా తీసేవారని.. అలాంటి వ్యక్తి దూరమవడం చాలా బాధాకరమన్నారు డైరెక్టర్ రాఘవేంద్రరావు. కళాతపస్వి కె. విశ్వనాథ్ తనకు పితృసమానులని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. విశ్వనాథ్ దూరం అవడం, ఇకలేరు అనడం అనేది తనను చాలా బాధించిందన్నారు. ఆయన గొప్పతనం గురించి, ఆయన ప్రతిభా పాఠాల గురించి చెప్పడానికి తన దగ్గర మాటలు లెవ్వన్నారు. ఆయన గురించి మాట్లాడాలంటే నా స్థాయి సరిపోదని చిరంజీవి తెలిపారు.
