నటుడు మోహన్‌లాల్ జ్వరం, శ్వాస ఆడకపోవటంతో ఆసుపత్రిలో చేరారు

నటుడు మోహన్‌లాల్ జ్వరం, శ్వాస ఆడకపోవటంతో ఆసుపత్రిలో చేరారు. కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్న తర్వాత మోహన్‌లాల్ ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడు పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. మోహన్‌లాల్ అస్వస్థతకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి అధికారులు విడుదల చేశారు. మోహన్‌లాల్‌కు శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఆయ‌న‌కు వైద్యులు ఐదు రోజుల విశ్రాంతిని సూచించారు.

రద్దీగా ఉండే ప్రదేశాలను సందర్శించడం మానుకోవాలని కూడా సూచించారు. మోహన్‌లాల్ కోలుకుంటున్నారని ఆసుపత్రి నుంచి విడుద‌ల చేసిన‌ మెడికల్ బులెటిన్ ద్వారా వెల్ల‌డించారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story