మంచు ఫ్యామిలీ లో గొడవలు ఇంకా సద్దుమణగా లేదు. రోజుకో వివాదం తెర మీదకి వస్తున్నది.
మంచు ఫ్యామిలీ లో గొడవలు ఇంకా సద్దుమణగా లేదు. రోజుకో వివాదం తెర మీదకి వస్తున్నది. ఈ గొడవలు ఒక వైపు నడుస్తూ ఉంటే, మరోవైపు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాను పూర్తి చేసే పనిలో బిజీ గా ఉన్నాడు విష్ణు.
మంచు కుటుంబం నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa) అన్న విషయం తెలిసిందే. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఇందులో మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా నటిస్తున్నాడు. చారిత్రక, పౌరాణిక నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్నారు
ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా.నుంచి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు ప్రముఖుల ఫస్ట్ లుక్‌లను పంచుకున్న మూవీ మేకర్స్ తాజాగా మళయాలం స్టార్ నటుడు మోహన్ లాల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో మోహన్ లాల్ కిరాట(Kirata) అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నాడు.