ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లకు విశేషమైన క్రేజ్‌ ఉంటుంది. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌(Mohanlaal)- జీతూ జోసెఫ్‌(Jittu Joseph) కాంబినేషన్‌ కూడా అందులో ఒకటి. వీరిద్దరు కలిసి చేసిన దృశ్యం(Dhrushyam), దృశ్యం 2(Dhrushyam-2) సినిమాలు బాక్సాఫీసును షేక్‌ చేశాయి. బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. లేటెస్ట్‌గా వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతున్నది.

ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లకు విశేషమైన క్రేజ్‌ ఉంటుంది. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌(Mohanlal)- జీతూ జోసెఫ్‌(Jeethu Joseph) కాంబినేషన్‌ కూడా అందులో ఒకటి. వీరిద్దరు కలిసి చేసిన దృశ్యం(Drishyam), దృశ్యం 2(Drishyam-2) సినిమాలు బాక్సాఫీసును షేక్‌ చేశాయి. బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. లేటెస్ట్‌గా వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతున్నది. ప్రొడక్షన్‌ నంబర్‌ 33గా రాబోతున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రం దృశ్యం ప్రాంఛైజీనా..? లేదంటే రామ్‌ ప్రాంఛైజీనా..? అనే దానిపై మాత్రం సస్పెన్స్‌ నెలకొంది.

ఆశీర్వాద్‌ సినిమాస్(Ashirwad Movies) బ్యానర్‌ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. మోహన్‌లాల్‌ నటిస్తోన్న రామ్‌.. పార్ట్‌-1 షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌ మొదలవుతుంది. కోచీ(Kochi), త్రివేండ్రమ్‌(Trivandrum) ప్రాంతాలలో సినిమా చిత్రీకరణ జరుగుతుంది. అయితే దీనిపై మోహన్‌లాల్‌ టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మోహన్‌లాల్‌ ఇప్పటికే పాన్‌ ఇండియా లెవల్‌ సినిమా వృషభ(Vrishabha) చేస్తున్నారు. హీరో శ్రీకాంత్‌ కుమారుడు రోషన్‌ ఇందులో మోహన్‌లాల్‌ కొడుకుగా నటిస్తున్నాడు.

మలయాళ, తెలుగు భాషలలో వృషభను నిర్మిస్తున్నారు. తమిళం, కన్నడ, హిందీ భాషలలో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. బాలాజీ టెలీఫిలిమ్స్‌, కనెక్ట్‌ మీడియా, ఏవీస్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై ఏక్తా కపూర్‌, వరుణ్ మథుర్‌, అభిషేక్ వ్యాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పాటు పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న మలైకోటై వాలిబన్‌లో కూడా మోహన్‌లాల్‌ నటిస్తున్నాడు. లిజో జోష్‌ పెల్లిస్సెరీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్‌ విద్యుత్‌ జమ్వాల్‌, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్‌ సేత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated On 14 July 2023 5:51 AM GMT
Ehatv

Ehatv

Next Story