తన గురించి ఎవరు ఏం అనుకున్నా డోంట్ కేర్ అన్నారు మంచు మోహన్ బాబు(Mohan babu). ఎవరు ఎన్ని పుకార్లు సృష్టించినా.. వాటిని తాను అస్సలు పట్టించుకోను అన్నారు. మనోజ్(Manchu Manoj) పెళ్ళి విషయంలో తాజాగా మరోసారి స్పందించారు కలెక్షన్ కింగ్.

Mohan Babu Reacts On Manchu Manoj marriage
తన గురించి ఎవరు ఏం అనుకున్నా డోంట్ కేర్ అన్నారు మంచు మోహన్ బాబు(Mohan babu). ఎవరు ఎన్ని పుకార్లు సృష్టించినా.. వాటిని తాను అస్సలు పట్టించుకోను అన్నారు. మనోజ్(Manchu Manoj) పెళ్ళి విషయంలో తాజాగా మరోసారి స్పందించారు కలెక్షన్ కింగ్.
ఎవరో ఏదో అన్నారు.. మీడియాలో ఏదో రాశారు అని నేను బాధపడను అన్నారు.. కలెక్షన్ కింగ్ మోహాన్ బాబు(Mohan babu). మనోజ్ పెళ్లి గురించి అది మోహన్ బాబుకు ఇష్టం లేకుండా జరిగింది అన్న రూమర్ గురించి మీడియా మోహన్ బాబును కదిలించగా.. ఆయన స్పందించారు. మనోజ్ పెళ్లి నేను ఎలా కాదని అంటాను.. అంటూ రివర్స్ ప్రశ్న వేశారు మోహన్ బాబు. మనోజ్ (Manchu Manoj)పెళ్లి తనకు ఇష్టం లేదు అని.. ఎవరు ప్రచారం చేసినా.. ఎన్ని రాసుకున్నా తాను పట్టించుకోను అన్నారు. ఎవరో ఏదో అన్నారని బాధపడటను అని కూడా చెప్పారు మంచు. అసలు అలాంటివి ఆలోచించే అలవాటునాకు అలవాటు లేదు అన్నారు కలెక్షన్ కింగ్. అవన్నీ పంటించుకుంటూ పోతే నన్ను నేను మరిచిపోతాను అన్నారు మోహాన్ బాబు.
ఇక మనోజ్(Manchu Manoj) పెళ్ళి గురించి మాట్లాడుతూ.. ఒక రోజు మనోజ్ (Manchu Manoj)నా దగ్గరికి వచ్చి విషయం అంతా విరించాడు. పరిస్థితి ఇదీ నేను ఫిక్స్ అయ్యాను అంటూ.. వివరంగా చెప్పాడు. పెళ్ళి చేసుకుంటాను అన్నాడు. నేను ఒక్కసారి ఆలోచించారా అన్నాను. కాని లేదు డాడీ నేను నిర్ణయం తీసుకున్నాను. అది సరైనదే అని పక్కాగా ఫిక్స్ అయి ఉన్నారు. దాంతో మనోజ్ ఫిక్స్ అయ్యాడు కాబట్టి నేను కూడా అలాగే కానీ .. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను అంతే జరిగింది. కాని నేనేదో వ్యాతిరేంచినట్టు వార్తలు రకరకాలుగా రాసుకున్నారు. నేను వ్యాతిరేకిస్తే.. అసలు పెళ్ళికి ఎందుకు వెళ్తాను అన్నారు మెహన్ బాబు(Mohan babu).
ఇక తన గురించి మాట్లాడే వారి గురించి.. సోషల్ మీడియాలో రాసేవారి గురించి కూడా ఆయన స్పందించారు. రోడ్డు మీద ఏనుగు వెళుతుంటే.. కుక్కలెన్నో మొరుగుతూ ఉంటాయి. అవి పట్టించుకుంటే ఎట్లా.. అన్నారు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు .. సుఖంగా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రేమించుకున్నారు? వంటి విషయాల్లోకి డీప్ గా వెళ్లొద్దు. నేను హ్యాపీగా ఉన్నాను కనుకనే పెళ్లికి వెళ్లాను. ఈ విషమంలో రాద్దాంతం చేసేవారు ఇవన్నీ గమనించి ఉంటే ఇంత హడావిడి చేయరు. అయితే చేశారంటే.. వారి ఇష్టం అన్నారు మెహన్ బాబు.
ఇక మోహాన్ బాబు(Mohan babu) ఫ్యామిలి చాలా కాలంగా ట్రోల్స్ కు గురవుతున్నారు. మంచు మనోజ్(Manchu Manoj) తప్పించి. మంచు లక్ష్మీ(Lakshmi) , మెహన్ బాబు, విష్ణుల పై రకరకాల ట్రోల్స్, మీమ్స్ ట్రెండ్ అవుతుంటాయి. అటు మోహన్ బాబు కూడా సినిమాలుతగ్గించారు. ఆయన చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండటంతో.. క్యారెక్టర్ రోల్స్ మాత్రమే చేసుకుంటూ.. అప్పుడప్పుడు తెరపైమెరుస్తున్నారు. త్వరలో సమంత శాకుంతలం సినిమాలో దూర్వాసుడిగా కనిపించబోతున్నాడు మోహన్ బాబు(Mohan babu). అటు రాజకీయాలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు.
