✕
Mohan Babu Congratulated Balagam team: మంచువారింట బలగం టీమ్.. సన్మానించిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణు
By EhatvPublished on 5 April 2023 1:20 AM GMT
బలగం సినిమాతో మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా తన సత్తా చూపించడాడు జబర్థస్త్ వేణు. ఎన్నో ఎళ్లుగా సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతున్న వేణు.. జబర్థస్త్ తో మరింత ఫేమస్ అయ్యాడు. ఇన్నాళ్లు వెయిట్ చేసి.. తనలోని దర్శకుడిని ఒక్క సారిగా బయటకు తీసుకు వచ్చాడు. బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు వేణు.

x
Mohan Babu Congratulated Balagam team
-
- బలగం సినిమాతో మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా తన సత్తా చూపించడాడు జబర్థస్త్ వేణు. ఎన్నో ఎళ్లుగా సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతున్న వేణు.. జబర్థస్త్ తో మరింత ఫేమస్ అయ్యాడు. ఇన్నాళ్లు వెయిట్ చేసి.. తనలోని దర్శకుడిని ఒక్క సారిగా బయటకు తీసుకు వచ్చాడు. బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు వేణు.
-
- పల్లె ప్రకృతి అందాల నడుమ.. అచ్చమైన తెలంగాణ పల్లెలో జరిగిన కథను అద్భుతంగా చూపించాడు వేణు. కృత్రిమత్వం లేకుండా.. సహజంగా ఇంట్లో ఏం జరుగుతుంది. కుటుంబాలలో జరిగే కథ ఇది. సహజంగా మనం మన ఇంటి చుట్టు పక్కల జరిగే సంఘటనలా అనిపిస్తుంటుంది బలగం సినిమా చూస్తే.. ఇక ఇదే అందరికి ఆకర్షించింది సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ బలగం సినిమాకు ఫిదా అయిపోయారు.
-
- ఫిల్మ్ ఇండస్ట్రీ బలగం సినిమాకు ఫిదా అయిపోయింది. సినిమా టీమ్ తో పాటు దర్శకుడు వేణుపై ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి.. బలగం దర్శకుడు వేణును భోళా శంకర్ సెట్ కు పిలిచి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఇక తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా బలగం టీమ్‌ను ఇంటికి ఆహ్వానించి.. వారిని ప్రశంసించడమే కాకుండ ప్రత్యేకంగా సత్కరించాడు.
-
- రీసెంట్ గా మోహన్ బాబు, విష్ణు ఇద్దరు కలిసి బలగం సినిమా చూశారు.ఈ సినిమాలో పాత్రలకు.. ఎమోషన్స్ కు బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో వేణు తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన సినిమాను తెరకెక్కించాడని.. సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల్లో జీవించారని ప్రశంసించారు. సినిమా చూసిన వెంటనే బలగం టీమ్ కు కబురు పెట్టి ఇంటికి పిలిపించారు మెహాన్ బాబు.. ఈసినిమాలో నటించిన ప్రియదర్శి, రూపా లక్ష్మితో పాటు దర్శకుడు వేణుని ఇంటికి ఆహ్వానించి.. మోహన్ బాబు, విష్ణు సత్కరించారు.

Ehatv
Next Story