జైలర్(Jailer) సినిమాతో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు(rajinikanth) మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. రోబో తర్వాత పెద్దగా హిట్‌లేని రజనీకాంత్‌కు జైలర్ టన్నుల కొద్దీ ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పటికే 600 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు మోహన్‌లాల్(Mohanlal), శివరాజ్‌కమార్(Shivaraj Kumar) వంటి స్టార్లు కూడా నటించారు. ఇక ఇందులో విలన్‌గా నటించిన వినాయకన్‌కు కూడా మంచి పేరు వచ్చింది.
జైలర్(Jailer) సినిమాతో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు(rajinikanth) మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. రోబో తర్వాత పెద్దగా హిట్‌లేని రజనీకాంత్‌కు జైలర్ టన్నుల కొద్దీ ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పటికే 600 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు మోహన్‌లాల్(Mohanlal), శివరాజ్‌కమార్(Shivaraj Kumar) వంటి స్టార్లు కూడా నటించారు. ఇక ఇందులో విలన్‌గా నటించిన వినాయకన్‌కు కూడా మంచి పేరు వచ్చింది. ఇటీవల కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కన్నుమూసినప్పుడు వినాయకన్ తన ఫేస్‌బుక్ లైవ్‌లో
'అసలు ఊమెన్ చాందీ(Oomen Chandi) ఎవరు?. మూడు రోజులుగా అతని మరణం గురించి మీడియాలో విస్తృతంగా కవరేజీ రావడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి వార్తలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడాన్ని మీడియా మానుకోవాలి. మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా జరిగేదే. అందరిలాగే ఊమెన్ చాందీ కూడా చనిపోయారు.
అంతే కాకుండా ఊమెన్ చాందీని మంచి వ్యక్తిగా చిత్రీకరించడం తప్పు' అంటూ విమర్శలు చేశాడు. దీనిపై కేరళ అంతటా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో ఆ వీడియోను తొలగించాడు వినాయకన్. ఇక ఇప్పుడేమో అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. మలయాళ నటుడైన వినాయకన్ 1995 నుంచి సినీ పరిశ్రమలో ఉన్నాడు. కెరీర్ మొదట్లో చిన్నచిన్న పాత్రలు వేశాడు. తర్వాత కమెడియన్ అయ్యాడు. అటు పిమ్మట విలన్ తరహా రోల్స్ వేయడం మొదలు పెట్టాడు. జైలర్‌లో వేసిన వేషమే దక్షిణాదిలో అతడికి చాలా పేరు తీసుకొచ్చింది. 2019లో వినాయకన్ చేసిన ఓ పాడుపనిని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు నెటిజన్లు. మోడల్ మృదులా దేవితో ఇతడు ఫోన్‌లో చాలా అసభ్యంగా మాట్లాడాడు. 'నువ్వు నా రూమ్‌కు రా...! నీతో పాటు మీ అమ్మను కూడా నా రూమ్‌కు తీసుకురా ' అంటూ ఇతడు చేసిన ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది. ఈ విషయమై మృదుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి దర్యాప్తులో వినాయకన్ అలా మాట్లాడింది నిజమేనని తేలింది. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు వినాయకన్. నాలుగేళ్ల కిందట జరిగన ఈ సంఘటన ఇప్పుడు జైలర్ హిట్ కావడంతో మళ్లీ తెరపైకి వచ్చింది.