తాజాగా పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. ఈసందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి. అన్న పద్మశ్రీ అందుకోవడంతో బావోద్వేగానికి గురయ్యాడు.

MM Keeravani receives the Padma Shri Award
తాజాగా పద్మశ్రీ అవార్డ్(Padma Sri Award) అందుకున్నారు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి(Music Director Keeravani). ఈసందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి(Director Rajamouli). అన్న పద్మశ్రీ అందుకోవడంతో బావోద్వేగానికి గురయ్యాడు.
తెలుగు సినిమా కీర్తిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు రాజమౌళి. జక్కన్నతో కలిసి సినిమాను ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్లాడు కీరవాణి. నాటు నాటు పాటతో హాలీవుడ్ స్టార్స్ తో సైతం స్టెప్పులేపించాడు కీరవాణి. ఇక సంగీత ప్రపంచానికి కీరవాణి సేవలు మెచ్చి భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ప్రకటించగా.. తాజాగా అవార్డ్ నుఅందుకున్నారు కీరవాణి. రాష్ట్రపతి భవన్‌లో(Rashtrapati Bhavan)బుధవారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కీరవాణి పద్మశ్రీ పురస్కారం తీసుకున్నాడు.
గణతంత్ర దినోత్సవం(Republic day) సందర్భంగా దేశంలో పలురంగాలకు చెందిన ప్రముఖులకు పద్మాఅవార్డ్ లు ప్రకటించింది భారత ప్రభుత్వం. అయితే జనవరి 26న దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం(Central Government) పద్మ అవార్డులను అందించింది. ఈ అవార్డుల రెండో విడత ప్రధానోత్సవం బుధవారం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను అందజేశారు. మ్యూజిక్ రంగం నుంచి కీరవాణి అవార్డ్ అందుకున్నారు. ఇక కీరవాణితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి త్రియండి చినజీయర్ స్వామి పద్మభూషణ్ అందుకున్నాడు.
కీరవాణి పద్మశ్రీ అందుకోవడంతో ఆయన తమ్ముడు.. ఆర్ఆర్ఆర్ దర్శకుడు.. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. పెద్దన్నను చూస్తుంటే గర్వంగా ఉందంటూ కీరవాణితో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు రాజమౌళి. ఇక జక్కన్న ఇలా షేర్ చేశాడో లేదో.. ఫోటో అలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇక ఈ ఫోటోపై పలువురు నెటీజన్‌లు స్పందిస్తూ ఈ ఫోటోలో ఇద్దరూ పద్మ అవార్డు గ్రహితలున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
