జవాన్(Jawan), మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr.Polishetty) సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో పాటు.. ఒకే ఓటీటీ ప్లాట్ ఫామ్(OTT Platform) లో సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈరెండు సినిమాల హక్కులను పోటీ పడి మరీ.. నెట్ ప్లిక్స్(Netflix) దక్కించుకుందట. ముఖ్యంగా ఈ రెండు సినిమాల కోసం పెద్ద పెద్ద డిజిటల్ ప్లాట్ ఫార్మస్ పోటీ పడ్డట్టు సమాచారం.

జవాన్(Jawan), మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr.Polishetty) సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో పాటు.. ఒకే ఓటీటీ ప్లాట్ ఫామ్(OTT Platform) లో సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈరెండు సినిమాల హక్కులను పోటీ పడి మరీ.. నెట్ ప్లిక్స్(Netflix) దక్కించుకుందట. ముఖ్యంగా ఈ రెండు సినిమాల కోసం పెద్ద పెద్ద డిజిటల్ ప్లాట్ ఫార్మస్ పోటీ పడ్డట్టు సమాచారం. అందులో షారుఖ్ ఖాన్(Shahrukh Khan) జవాన్ మూవీ కోసం 300 నుంచి 400 కోట్ల వరకూ డిమాండ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఫైనల్ గా ఈమూవీని నెట్ ప్లిక్స్ సొంతం చేసుకుంది అంటూ బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.

షారుఖ్ ఖాన్ హీరోగా.. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) డైరెక్షన్ లో .. తెరకెక్కిన జవాన్ మూవీలో.. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) షారుఖ్ జోడీగా నటించింది. ఇక అనిరుధ్ రవిచంద్ర మ్యూజిక్ అందించిన ఈసినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. ఈరోజు రిలీజ్ అయిన ఈమూవీ యాక్షన్ లవర్స్ కు.. షారుఖ్ అభిమానులకు ఫుల్ మీల్స్ లా దొరికిందంటూ సంబరపడిపోతున్నారు.

అటు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో కూడా గట్టి పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. ఈమూవీ కోసం అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ , నెట్ ప్లిక్స్ లు గట్టి పోటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. చివరకు ఈ సినిమా కూడా నెట్ ప్లిక్స్ లో రిలీజ్ కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నెట్ ప్లిక్స్ తో పాటు.. ఈమూవీ అమెజాన్ ప్రైమ్(Amazon Prime) లో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

అనుష్క 5(anushka Shetty) ఏళ్ళ బ్రేక్ తరువాత ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఇప్పటికే ప్రిమియర్స్ టాక్ పాజిటీవ్ గా వనిపిస్తుంది. స్వీటీ నటన అద్భుతమని.. ఏమాత్రం ప్రభావం తగ్గకుండా పెర్ఫామెన్స్ తో అదరగోట్టిందంటూ ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. మరి ఈమూవీ కలెక్షన్లు.. స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇక మరో విషయం ఏంటీ అంటే జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నవంబర్ లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Updated On 8 Sep 2023 7:38 AM GMT
Ehatv

Ehatv

Next Story