మూడేళ్ల కిందట మిస్ ఇండియా(Miss India) టైటిల్ గెల్చుకున్న పదహారణాల తెలుగమ్మాయి మానస వారణాసి(Manasa varanasi) గుర్తున్నారు కదా! ఇప్పుడామె హీరోయిన్ కాబోతున్నారు. యువ కథానాయకుడు అశోక్ గల్లా(Ashok Galla) హీరోగా వస్తున్న ఓ సినిమాలో మానస కథానాయిక. ఈ సినిమాకు అర్జున్ జంధ్యాల(Arjun jandhyala) దర్శకత్వం వహిస్తున్నాడు.

Manasa Varanasi
మూడేళ్ల కిందట మిస్ ఇండియా(Miss India) టైటిల్ గెల్చుకున్న పదహారణాల తెలుగమ్మాయి మానస వారణాసి(Manasa varanasi) గుర్తున్నారు కదా! ఇప్పుడామె హీరోయిన్ కాబోతున్నారు. యువ కథానాయకుడు అశోక్ గల్లా(Ashok Galla) హీరోగా వస్తున్న ఓ సినిమాలో మానస కథానాయిక. ఈ సినిమాకు అర్జున్ జంధ్యాల(Arjun jandhyala) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ అందించిన కథతో రూపొందుతున్న ఈ సినిమాను లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మానస వారణాసి పోషిస్తున్న పాత్రని చిత్రబృందం పరిచయం చేసింది. సత్యభామగా ఆమె తెరపై సందడి చేయనున్నారు. ‘‘అశోక్ గల్లా మాస్ లుక్‌లో... యాక్షన్ అవతారంలో ఈ సినిమాలో సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మాటలు బుర్రా సాయిమాధవ్ అందిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.
