అడ్డమైన చెత్తనంతా ఓటీటీలో(OTT) డంప్‌ చేస్తున్నారన్న విమర్శలు చాలానే వస్తున్నాయి. క్రియేటివిటీ పేరుతో అడల్డ్‌ కంటెంట్‌ను(Adult Content) చిత్రీకరిస్తున్నారు. ఈ మధ్య వచ్చిన చాలా వెబ్‌ సిరీస్‌లు(Webseries) ఇలాగే ఉన్నాయి. బూతు మాటలు, మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉంటున్నాయి.

అడ్డమైన చెత్తనంతా ఓటీటీలో(OTT) డంప్‌ చేస్తున్నారన్న విమర్శలు చాలానే వస్తున్నాయి. క్రియేటివిటీ పేరుతో అడల్డ్‌ కంటెంట్‌ను(Adult Content) చిత్రీకరిస్తున్నారు. ఈ మధ్య వచ్చిన చాలా వెబ్‌ సిరీస్‌లు(Webseries) ఇలాగే ఉన్నాయి. బూతు మాటలు, మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉంటున్నాయి. కుటుంబంతో కలిసి చూడాలంటే ఇబ్బందిగా ఉంటోందని చాలా మంది అంటున్నారు. ఓటీటీలలో ప్రసారమవుతున్న కంటెంట్‌పై కచ్చితంగా నియంత్రణ ఉండాలని అంటున్నారు.

అసభ్యపదజాలం, విచ్చలవిడి శృంగారం, మితిమీరిన హింసతో కూడిన కంటెంట్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఓటీటీలకు కూడా సెన్సార్‌షిప్‌ ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక సూచన చేసింది. అశ్లీలత, హింసతో కూడిన కంటెంట్‌ను ప్రసారం చేసే ముందు ఓటీటీ సంస్థలు స్వీయ సమీక్ష చేయాలని కోరింది.

జూన్‌ 20న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ(Ministry of Broadcasting) ఆధ్వర్యంలో ఓటీటీ సంస్థలతో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన చేశారు. అయితే ఈ ప్రతిపాదనలను ఓటీటీ సంస్థలు వ్యతిరేకించాయట! దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసిందని ప్రముఖ ఓటీటీ సంస్థకు చెందిన ఓ ప్రతినిధి చెప్పారు. సమావేశంలో పాల్గొన్న ఎంపీలు(MP), ప్రజా సంఘాల ప్రతినిధులు మాత్రం ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్‌పై సమీక్ష తప్పనిసరిగా ఉండాల్సిందేనని, ఇందుకోసం ప్రత్యేక సెన్సార్‌షిప్‌(Censorship) అవసరమని గట్టిగా చెప్పారు.

ఈ సమావేశంలో అమెజాన్ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్, రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్‌ యూనిట్‌, వైకామ్‌ 18, యాపిల్‌ టీవీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే భారత్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌ మార్కెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు అడ్డంకులుగా మారే అవకాశం ఉందని ఓటీటీ సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఓటీటీ సంస్థలపై చురకలు వేశారు. సృజనాత్మకత పేరుతో ఓటీటీ సంస్థలు అశ్లీలత, హింసను ప్రసారం చేయవద్దని సూచించారు. అభ్యంతరకరమైన ప్రసారాలు పెరిగితే మాత్రం కేంద్ర ఊరుకోదని, వాటి నియంత్రణ కోసం నిబంధనల్లో మార్పులు చేస్తుందని స్పష్టం చేశారు.

Updated On 15 July 2023 12:52 AM GMT
Ehatv

Ehatv

Next Story