నాపై కేసిఆర్ పూర్తి రాజకీయ దురద్దేశంతో ఆరోపణలు చేశారు. కేసిఆర్ మాటల్లో అసత్యాలు, నిరాధారమైన ఆరోపణలు తప్పా ఒక్కటి నిజం లేదని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు.

నాపై కేసిఆర్ పూర్తి రాజకీయ దురద్దేశంతో ఆరోపణలు చేశారు. కేసిఆర్ మాటల్లో అసత్యాలు, నిరాధారమైన ఆరోపణలు తప్పా ఒక్కటి నిజం లేదని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు. కేసిఆర్ కు అధికారం పోయిందనే బాధ.. ఆయన మాటల్లో, ఆయన ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. నేను బీఆర్ఎస్ తప్పులను ఎత్తిచూపితే.. కేసీఆర్ అధికారం పోయిన ఫ్ట్రస్టే షన్ లో నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నడని అన్నారు. నేను వాళ్ల భూభాగోతాల్ని, లిక్కర్ మాఫీయాను ఎత్తిచూపితే, వాళ్ల ఫోన్ ట్యాపింగ్ అరాచకాల్ని ప్రజల ముందు పెడితే.. వాళ్ల పాలనలో డ్రగ్స్ మాఫియా గురించి ప్రశ్నిస్తే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడని అన్నారు.

ప్రజల్ని కష్టాల పాలు చేసిన కేసిఆరే.. ప్రజలు కష్టపడుతున్నారని మొసలి కన్నీరు కారుస్తుండటం విచిత్రమైన పరిస్థితన్నారు. ఇప్పుడు కేసీఆర్ రాజకీయ యాత్రలకన్నా.. తీహార్ జైలు యాత్ర చేస్తే బాగుంటుందన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ భయంతో ప్రజల్లో సానుభూతి కోసం రాజకీయ యాత్రలు చేయడం తప్ప కేసిఆర్ కు ఏనాడు ప్రజల గురించి చిత్తశుద్దితో పనిచేసింది లేదన్నారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం.. నాన్ బెయిలెబుల్ గా మూడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందన్నారు. ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం వరుసగా రెండు సంవత్సరాలు జైళు శిక్షపడితే విడుదల అయిన తర్వాత ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటి చేయరాదని స్పష్టంగా ఉంది. ఇంకా కేసీఆర్ రాజకీయాలు వదిలేస్తే మంచిదన్నారు.

నేను ప్రజల ముందు ఉన్న నిజాల్ని ప్రశ్నిస్తే.. కేసీఆర్ నాపై బురదజల్లి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నడు. నా జీవితం ప్రజా సేవకే అంకితం.. విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లోకి ఉన్నా.. ఇప్పటి దాకా అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజా సేవలోనే ఉన్నా. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే.. కాంగ్రెస్ కార్యకర్తలు కర్రు కాల్చి వాతలు పెడతరని హెచ్చ‌రించారు. నా పేరు తీసే అర్హత కేసీఆర్ కు లేదు.. నేను ఏ కాంట్రాక్టు కంపెనీలో డైరెక్టర్ గా, పర్ట్ నర్ గా లేనని తెలిపారు.

నా జీవితం తెరిచిన పుస్తకం.. నాకు మీలా బుర్జ్ ఖలిఫాలో 69 ఫ్లోర్ లో ఇల్లు లేదు.. ఇప్పటికీ కిరాయి ఇంట్లోనే ఉంటున్న.. నీకు దమ్ముంటే నాకు కంపెనీ ఉందని నిరూపించి మాట్లాడు అంతేకానీ.. ఈ గాలి మాటలు మాట్లాడి కాదని అన్నారు. నేను నీలా మల్టీవిటమిన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకొని.. నాలుగు గోడల మధ్య దొంగ దీక్షలు చేయలేదన్నారు. బాజాప్తా ప్రజల మధ్యలో చేశా.. ప్రజల కండ్ల ముందు చేశా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటే నిప్పు లాంటి వ్యక్తి.. నీలా తప్పులు చేసే వ్యక్తి కాదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద ఆరోపణలు చేసే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడితే మంచిదని సూచించారు.

Updated On 6 April 2024 4:56 AM GMT
Yagnik

Yagnik

Next Story