సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దిల్ రాజు(Dil Raju) మినహా తనకు ఎవరూ ఫోన్ చేయలేదని.. కనీసం విషెస్(Wish) కూడా చెప్పలేదంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో(Social media) వైరల్‎గా మారాయి. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తనకు తెలియాలని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సినీ పరిశ్రమ రంగంపై వారం రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని తన సెక్రటరీని ఆదేశించారు.

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్(congress) ప్రభుత్వలో సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యలు చేపట్టిన తనకు ఇండస్ట్రీ పెద్దలు ఎవరూ పలకరించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దిల్‌రాజ్‌ తప్ప ఎవరూ కనీసం విషెస్‌ చెప్పలేదంటూ వాపోయారు.
ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో(Industry) ఏం జరుగుతుందో తనకు తెలియాలని, వారం రోజుల్లో ఒక నివేదిక ఇవ్వాలని తన సెక్రటరీని ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రస్తుతం సినీ నిర్మాత దిల్ రాజు అమెరికా పర్యటనలో ఉన్నారు. దిల్‌రాజ్‌ తిరిగి ఇండియాకు వచ్చాక మంత్రిని కలుస్తారని తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను టాలీవుడ్‌ ఆసక్తిగా గమనిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఇండస్ట్రీ పట్ల ఎలా వ్యవహరిస్తుంది? ప్రభుత్వ సపోర్ట్‌ ఎంతవరకు ఉంటుంది?.. అనే చర్చలు టాలీవుడ్‌లో మొదలయ్యాయి. గతంలో రెండు సార్లు సినిమాటోగ్రఫీ మంత్రిగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పని చేశారు. సినిమా ఈవెంట్స్‌లో రెగ్యులర్‌గా పాల్గొంటూ సినీ ఇండస్ట్రీ వర్గాలతో సన్నిహితంగా వ్యవహరించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా పరిశ్రమ అభివృద్ధికి సహకరించింది.

అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమ పట్ల ఎలా వ్యవహరిస్తుందనేదానిపై ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నంది అవార్డులను ఇచ్చింది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ అవార్డులు కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యాయి. కొత్త ప్రభుత్వం అయినా పెద్ద మనసు చేసుకొని ఆ అవార్డులను ఇస్తుందా లేదా అని టాలీవుడ్‌ పెద్దలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి తమ సమస్యలను వినిపించుకునేందుకు టాలీవుడ్‌ పెద్దలు రెడీ అవుతున్న సమయంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సర్వత్ర చర్చనీయాంగా మారాయి.

Updated On 11 Dec 2023 7:03 AM GMT
Ehatv

Ehatv

Next Story