స్టార్ హీరోయిన్ గా తెలుగు తెరను ఏలింది మిల్క్ బ్యూటీ తమన్నా(Tamannaah)... దాదాపు రెండు దశాబ్ధాలుగా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. ఇప్పటికే కోట్ల ఆస్తులను పోగేసిందట.

స్టార్ హీరోయిన్ గా తెలుగు తెరను ఏలింది మిల్క్ బ్యూటీ తమన్నా(Tamannaah)... దాదాపు రెండు దశాబ్ధాలుగా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. ఇప్పటికే కోట్ల ఆస్తులను పోగేసిందట.

టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ తో దూసుకుపోయింది మిల్కీ బ్యూటీగా తమన్నా భాటియా... స్టార్ ఇమేజ్ తో ఓ వెలుగు వెలిగింది బ్యూటీ. కొన్ని వేల మంది అభిమానులను సంపాధించుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గినా కూడా.. ఏమాత్రం తగ్గకుండా.. అదే ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తూ.. అదే గ్లామర్ తో వరుసగా ఆఫర్లు అందుకుంటుంది చిన్నది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రస్తుతం కూడా బిజీగా ఉంది తమన్నా.

ఇలా వరుస సినిమాలు చేస్తూ తమన్నా కోట్లలో సంపాదించినట్టు తెలుస్తోంది. త‌మ‌న్నా పేరిన కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. తమ్మూ బేబీ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుందట.

17 ఏళ్ల నుంచి టాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతోంది తమన్నా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ..గ్యాప్ లేకుండా బిజీగా గడిపేస్తోంది బ్యూటీ.. గ‌ట్టిగానే సంపాదిస్తుంది. ఒక్కో సినిమాకు తమన్నా 3 నుంచి 4 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందట. వీటితో పాటు కొన్ని ప్రాడక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది తమన్నా. కమర్షియల్ ఆడ్స్ తో కూడా విపరీతంగా సంపాదించుకుంటుంది బ్యూటీ.

అంతే కాదు ఇటు సినిమాలు.. అటుయాడ్స్ తో పాటు... మ‌రోవైపు బిజినెస్ రంగంలోకూడా అడుగు పెట్టింది బ్యూటీ. 2015లో ఆమె వైట్ & గోల్డ్ పేరుతో జ్యూవ్వెలరీ బిజినెస్ ను స్టార్ట్ చేసింది మిల్క్ బ్యూటీ. ఈ బిజినెస్ లో మిల్కీ బ్యూటీ సూప‌ర్ స‌క్సెస్ అయింది. ముంబయ్ లో బాగానే ఆస్తులు కూడబెటింది బ్యూటీ. ముంబైలోని వెర్సోవాలో 16 కోట్లు విలువ చేసే విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్ త‌మ‌న్నాకు ఉంది. ల్యాండ్ రోవర్ డిస్కవరీ, బీఎమ్‌డ‌బ్లూ 5 సిరీస్ మరియు మెర్సిడెస్ బెంజ్ వంటి అనేక ల‌గ్జ‌రీ కార్లు త‌మ‌న్నా గ్యారేజ్ లో ఉన్నాయి.

ఇక త‌మ‌న్నా ఏడాదికి 15 కోట్ల‌కు పైగా సంపాదిస్తుంద‌ట‌. సంపాద‌న విష‌యంలో స్టార్ హీరోలకు ఏమాత్రం తక్కువ లేదట బ్యూటీ. త‌మ‌న్నా ఆస్తుల విలువ మొత్తంగా 120 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంటున్నారు. అంతే కాదు కోట్ల విలువ చేసే ప్రాపర్టీస్ ఆమె సొంతం. లక్జరీ కార్లు, ఇళ్ల కూడా ఉన్నాయట తమ్ముకీ.

రీసెంట్ గా బాలీవుడ్ లో విడుద‌లైన జీ కర్దా, ల‌స్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌ల‌లో బోల్డ్ యాక్టింగ్ తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన‌ త‌మ‌న్నా.. త్వ‌ర‌లోనే రెండు సినిమాల‌తో ఆడియన్స్ నుఅలరిస్తోంది.టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంక‌ర్‌'తో పాటు.. తమిళ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ 'జైల‌ర్‌ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది బ్యూటీ. ఈ రెండు సినిమాలు ఆగ‌స్టు లోనే రిలీజ్ కాబోతున్నాయి. ఒక్క రోజు తేడాతో ఈ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. జైల‌ర్ సినిమా ఆగ‌స్టు 10న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అలాగే భోళా శంక‌ర్ ఆగ‌స్టు 11న రిలీజ్ కాబోతుంది.

Updated On 31 July 2023 12:33 AM GMT
Ehatv

Ehatv

Next Story