మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) అందమే అందం! పరిచయం అక్కర్లేని నటి ఆమె! టాలీవుడ్‌లో దాదాపు అగ్ర హీరోలందరితో కలిసి నటించారు తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమె బిజీ నటి. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌పై అందాలను ఆరబోసే తమన్నా నటనకు స్కోప్‌ ఉన్న ఏ పాత్రనైనా అవలీలగా పోషిస్తారు. అందుకే పద్దెనిమిదేళ్ల నుంచి హీరోయిన్‌గా కొనసాగుతున్నారు.

మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) అందమే అందం! పరిచయం అక్కర్లేని నటి ఆమె! టాలీవుడ్‌లో దాదాపు అగ్ర హీరోలందరితో కలిసి నటించారు తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమె బిజీ నటి. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌పై అందాలను ఆరబోసే తమన్నా నటనకు స్కోప్‌ ఉన్న ఏ పాత్రనైనా అవలీలగా పోషిస్తారు. అందుకే పద్దెనిమిదేళ్ల నుంచి హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. 2005 నుంచి తమన్నా హీరోయిన్‌గానే నటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం తమన్నా అయిదారు సినిమాల్లో నటిస్తున్నారు. ఇందులో తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో పాటు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajini Kanth) నటిస్తున్న జైలర్‌లో(Jailer) హీరోయిన్‌ తమన్నానే! ఈ సినిమా ఆగస్టు 10వ తేదీన రిలీజ్‌ అవుతున్నది.

ఆ మరుసటి రోజునే అంటే ఆగస్టు 11వ తేదీన తెలుగులో చిరంజీవితో(chiranjeevi) నటించిన భోళాశంకర్‌(Bholashankar) సినిమా విడుదల కాబోతున్నది. తమన్నా నటిస్తున్న తమిళ చిత్రం అరణ్మణై -4(Aranmanai -4), మలయాళం చిత్రం బాంద్రా(Bandhra), హిందీ చిత్రం బోల్‌ చుడియన్‌(Bol Chudiya) సినిమాలు షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. 33 ఏళ్ల వయసులోనూ తమన్నా చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంటున్నారు. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫోటోలను షేర్‌ చేస్తుంటారు తమన్నా. ఆ గ్లామరస్‌ ఫోటోలు ఇట్టే వైరల్‌ అవుతుంటాయి. ఇదిలా ఉంటే రజనీకాంత్‌ సరసన నటించిన జైలర్‌ చిత్రం షూటింగ్‌ పూర్తయ్యింది. రజనీకాంత్‌కు ఓ మంచి అలవాటు ఉంది. తనను కలిసినవారికి ఆయన రాఘవేంద్రస్వామి విగ్రహాన్ని, ఓ ఆధ్యాత్మిక పుస్తకాన్ని బహుకరిస్తుంటుంటారు. అదే విధంగా తనను కలిసిన నటి తమన్నాకు క ఆధ్యాత్మిక పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ఈ విషయాన్ఇన తమన్నా ట్విట్టర్లో తెలిపారు. జైలర్‌ సినిమా షూటింగ్‌ సమయంలో రజనీకాంత్‌ తనకు ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆయన సంతకంతో బహూకరించారని, అది తనకు చాలా ఉపయోకరంగా ఉందని తమన్నా అన్నారు.

Updated On 12 Jun 2023 7:04 AM GMT
Ehatv

Ehatv

Next Story