✕
Meter Movie 2023 : కిరణ్ అబ్బవరం ‘మీటర్’ టీజర్‌కి, సాంగ్‌కి బ్రహ్మరథం
By EhatvPublished on 18 March 2023 3:21 AM GMT
మైత్రీ మూవీస్ బ్యానర్‌పై యంగ్ తరంగ్ కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం మీటర్‌కి సంబంధించిన నిర్మాతలు విడుదల చేసిన ‘టీజర్ అండ్ చమ్మక్ చమ్మక్ పోరీ’ పాటకు అద్బుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. టీజర్‌కి 4 మిలియన్స్ వ్యూస్, పాటకి 3 మిలియన్ వ్యూస్లతో ‘మీటర్’ సోషల్ మీడియాలో విపరీతమైన సందడి చేస్తోంది.

x
Kiran Abbavaram
-
- మైత్రీ మూవీస్ బ్యానర్‌పై యంగ్ తరంగ్ కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం మీటర్‌కి సంబంధించిన నిర్మాతలు విడుదల చేసిన ‘టీజర్ అండ్ చమ్మక్ చమ్మక్ పోరీ’ పాటకు అద్బుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. టీజర్‌కి 4 మిలియన్స్ వ్యూస్, పాటకి 3 మిలియన్ వ్యూస్లతో ‘మీటర్’ సోషల్ మీడియాలో విపరీతమైన సందడి చేస్తోంది.
-
- రెండూ రిలీజైన దగ్గరనుంచి కూడా రోజురోజుకీ వేలకివేలు వ్యూస్ కెరటాల్లా వచ్చి పడుతుంటే ‘మీటర్’ సినిమా మీద సహజంగానే అంచనాలు మారుమోగుతున్నాయి. టీజర్లో కిరణ్ మాస్ లుక్, హై ఓల్టేజ్ డైలాగులు, మాస్‌ని పిచ్చెక్కించే మూవ్మెంట్స్ వెరసి కిరణ్కింత ఫాలోయింగ్ ఉందా అని పరిశ్రమలో అందరూ అవాక్కవుతున్నారు.
-
- ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రంలో కామ్‌గా, కూల్‌గా ఉంటూ, నాకు షుగర్ ఉంది సార్ అని చెప్పేంత అండర్ డాగ్ క్యారెక్టర్ చేసి అలవోకగా మెప్పించగలిగిన కిరణ్, ఇప్పడు ‘మీటర్’లో దేశముదురులా కనిపించడమే కాకుండా కత్తిలాంటి డైలాగులు చాలా ఈజీగా, బాగా రాటుదేలిన మాస్ హీరోలా ధీటుగా చెప్పడంతో మీటర్ మాస్ హిట్ అవుతుందన్న సంకేతాలను అందరూ గుర్తించగలుగుతున్నారు.
-
- పైగా ‘ఛమ్మక్ ఛమ్మక్ పోరీ’ పాటలో కిరణ్ డాన్స్ చాలా ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా అందరినీ బాగా ఆకట్టుకుని విపరీతమైన ట్రెండింగ్‌లో ఉందిప్పుడు. ఇంకేం కావాలి....లుక్, డైలాగ్‌లు, మాస్ టచ్, సాంగ్స్ ఇన్ని కలిస్తే మీటర్ మాస్ హిట్ అవడానికి ఇంకేం కావాలి. వీటన్నిటినీ మించి, నిర్మాతలు గోల్డెన్ హ్యాండ్స్ నవీన్, రవి, చెర్రీ ముగ్గురు ముహూర్తం పెట్టిన సినిమా ఇది.
-
- అడుగు పెట్టిన దగ్గర్నుంచి, వాళ్ళ కత్తికి ఎదురులేకుండా సాగుతోంది వాళ్ళ జైత్రయాత్ర. ఆ ఎఫెక్ట్ కూడా ‘మీటర్’ సినిమా మీద చాలా ఒత్తైన ప్రభావం చూపుతోంది. మైత్రీ సంస్థ చేతులు ముడుచుకుని కూర్చోకుండా, ఎవరిమీదనో ఆధారపడి ధియేటర్ల కోసం ఎదురుచూపులు చూస్తూ కూర్చోకుండా పంపిణీ వ్యవస్థలోకి కూడా దూసుకెళ్ళారు.
-
- అదీ మరీ మీటర్‌కి మంచి అడ్వాంటేజ్. మెరిట్ అండ్ మెయిన్ ధియేటర్స్ ఊరికే అలవోకగా వస్తాయి. మైత్రిరేంజ్ అదీ ఈ రోజున. డబ్బుకి వెనుకాడకుండా ఖర్చు పెట్టీ తీశారు. ఇవన్నీ హీరోల స్క్రీన్ ప్రెజెన్స్‌కి బాగా కీ ఇస్తాయి. అఫ్ కోర్స్... కిరణ్ ఏ సినిమా అయినా ఒకే రకంగా కష్టపడే హీరో. అందులో సందేహం లేదు.
-
- కాకపోతే నిర్మాతల వైపునుంచి లభించే ప్రోత్సాహం కూడా చాలా వరకూ ఎలివేట్ చేస్తుంది. అదే కిరణ్ కూడా ప్రతీసారీ, ప్రతీచోటా మనసు విప్పి చెబుతున్నాడు. అది అభిమానులకు ఊహించని ఎనర్జీనిస్తోంది. కిరణ్ అబ్బరం ఖాతాలో మరో సెన్సేషన్ నమోదు కాబోతున్నట్లుగా కిరణ్‌తో త్వరలో చెయ్యబోతున్న నిర్మాతలు లెక్కలు కట్టుకుంటున్నారు. అందరి అంచనాలకు అనుగుణంగా ‘మీటర్’ సక్సెస్ సాధించి, కిరణ్ అబ్బవరం దూసుకెళ్ళే ఛాయలే ప్రతిఫలిస్తున్నాయి. ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ‘మీటర్’కి ముందస్తుగానే శుభాకాంక్షలు

Ehatv
Next Story