పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ధనుష్‌(Danush) తమ కుమారుడేనంటూ మేలూరుకు చెందిన కదిరేశన్‌, మీనాక్షి దంపతులు కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే! మేలూరు కోర్టులో(Meluru Court) దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు, మదురై ధర్మాసనం కొట్టివేసింది. ధనుష్‌ తమ కుమారుడని 2015లో మేలూర్‌ కోర్టులో కదిరేశన్‌, మీనాక్షి దంపతులు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధనుష్‌ తమ కుమారుడే అని నిరూపించడానికి బర్త్‌ సర్టిఫికేట్, టెన్త్‌ క్లాస్‌ టీసీలను సాక్ష్యాధారాలుగా కోర్టుకు సమర్పించారు.

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ధనుష్‌(Danush) తమ కుమారుడేనంటూ మేలూరుకు చెందిన కదిరేశన్‌, మీనాక్షి దంపతులు కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే! మేలూరు కోర్టులో(Meluru Court) దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు, మదురై ధర్మాసనం కొట్టివేసింది. ధనుష్‌ తమ కుమారుడని 2015లో మేలూర్‌ కోర్టులో కదిరేశన్‌, మీనాక్షి దంపతులు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధనుష్‌ తమ కుమారుడే అని నిరూపించడానికి బర్త్‌ సర్టిఫికేట్, టెన్త్‌ క్లాస్‌ టీసీలను సాక్ష్యాధారాలుగా కోర్టుకు సమర్పించారు. దాంతోపాటు 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ లో తన పేరును రిజిస్టర్‌ చేసుకున్న సర్టిఫికెట్‌ను కూడా కోర్టుకు సమర్పించారు. స్కూల్‌లో చదువుతున్నప్పుడు ధనుష్‌ ఇంట్లోంచి పారిపోయాడని కోర్టుకు చెప్పారు. అయితే ధనుష్‌ తమ కొడుకేనని వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం కేసును కొట్టేసింది. సరైన ఆధారాలు లేనందునే కేసును కొట్టివేస్తున్నామని తెలిపింది. కదిరేశన్‌ సమర్పించిన టీసీలో(TC) పుట్టుమచ్చలు(Mole) ఎక్కడెక్కడ ఉన్నాయో ఉంది. ధనుష్‌ లాయర్లు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు లేవు. దీనిపై జడ్జి ప్రశ్నించగా అసలు కదిరేశన్‌, మీనాక్షి చెబుతున్న పుట్టుమచ్చలు ధనుష్‌కు లేవని అతడి తరపు న్యాయవాదులు తెలిపారు. దీంతో కొన్ని రోజుల క్రితం ధనుష్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హజరయ్యారు. కోర్టు రిజిస్టార్‌ సమక్షంలో మేలూర్‌ రాజాజీ గవర్నమెంట్ హాస్పిటల్‌ డీన్‌ ధనుష్‌ పుట్టుమచ్చలను పరిశీలించారు. ధనుష్‌కు పుట్టుమచ్చలు లేవని తేలడంతో కదిరేశన్ దంపతులు వేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. సుమారు ఎనిమిదేళ్ల పాటు అనేక అధారాలపై విచారణ జరిపిన కోర్టు కస్తూరి రాజా, విజయలక్ష్మిలకే ధనుష్‌ జన్మించినట్లు తీర్పును వెళ్లడించింది.

Updated On 14 March 2024 4:35 AM GMT
Ehatv

Ehatv

Next Story