✕
Mehreen Pirzada : బ్లాక్ కలర్ శారీలో చాలా క్యూట్‌గా కనిపిస్తోన్న మహాలక్ష్మీ.. ఇలా అయ్యావేంటంటున్న ఫ్యాన్స్.. !
By EhatvPublished on 10 May 2023 2:20 AM GMT
ఒకప్పుడు హీరోయిన్ అంటే ముద్దుగా, బొద్దుగా ఉంటేనే అవకాశాలు తన్నుకుంటూ వచ్చేవి. దాంతోపాటు కాస్త అందం, అభినయం ఉంటే ఇంక తిరుగేలేదు మరి అప్పట్లో. ఇక ఇప్పుడు అలా కాదు.. ట్రెండ్ మారింది.

x
Mehreen Pirzada
-
- ఒకప్పుడు హీరోయిన్ అంటే ముద్దుగా, బొద్దుగా ఉంటేనే అవకాశాలు తన్నుకుంటూ వచ్చేవి. దాంతోపాటు కాస్త అందం, అభినయం ఉంటే ఇంక తిరుగేలేదు మరి అప్పట్లో. ఇక ఇప్పుడు అలా కాదు.. ట్రెండ్ మారింది. ఇప్పుడు ముద్దుగా బొద్దుగా ఉంటే కుదరదట. ఇప్పుడు అంతా జీరో సైజ్ వైపే మొగ్గు చూపుతున్నారు. సన్నగా.. నాజూగ్గా ఉంటేనే ఇప్పటి హీరోయిన్లకు అవకాశాలు. ఇప్పుడు ఏ హీరోయిన్ను చూసినా.. సినిమాల్లో కంటే జీమ్లలోనే కనిపిస్తున్నారు. గ్లామర్‌తో కట్టిపడేయాలంటే స్లిమ్‌లుక్ తప్పదంటున్నారు.
-
- ఇక స్లిమ్ లుక్ వైపే మొగ్గుచూపుతోంది మన టాలీవుడ్ భామ మెహ్రీన్ పిర్జాదా. తాజాగా ఈ బ్యూటీ రిలీజ్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ భామ కొత్త లుక్‌తో ఉన్న ఫొటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. అయితే ఈ భామ గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ఇప్పుడు మళ్లీ ఓ కొత్త అవతారంతో మన ముందుకొచ్చింది. మెహ్రీన్ తన బరువును చాలా వరకు తగ్గించుకుంటున్నట్టు తెలుస్తోంది. బరువు తగ్గిన తర్వాత ఆమె ఇప్పుడు చాలా డిఫరెంట్‌గా కనిపిస్తోంది.
-
- ఈ భామ ‘‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన ‘‘రాజా ది గ్రేట్’’ చిత్రంలో నటించి తన పాకెట్ రెండో హిట్ వేసుకుంది ఈ మహాలక్ష్మి. సెకండ్ మూవీ పెద్దగా ఆడకపోయినా మూడో సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత తమిళంలో ఒక సినిమా చేసి.. మళ్లీ ఇటు తెలుగు చిత్ర పరిశ్రమపై ఫోకస్ పెట్టింది ఈ ‘లక్కీ’ గర్ల్.
-
- రాజా ది గ్రేట్ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. ఆమె చేసిన కేరాఫ్ సూర్య, జవాన్, పంతం, కవచం వంటి చిత్రాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టాయి. 2018లో మళ్లీ అనిల్ రావిపుడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 చిత్రంతో మెహ్రీన్ పిర్జాదా ఆడియన్స్‌ను అలరించింది. ఆ చిత్రంలో హనీ క్యారెక్టర్‌తో హనీ ఈజ్ ది బెస్ట్ అనిపించుకుంది
-
- ఇక ఆ చిత్రంతో తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఆమెను నిరాశపర్చాయి. మంచిరోజులొచ్చాయి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన్నప్పటికీ ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. ఇ తర్వాత ఎఫ్3లో హనీ ఈజ్ ది బెస్ట్ అనిపించుకుందామని ట్రై చేసినప్పటికి కూడా హనీ ఆడియన్స్‌కి కాస్త బొర్ కొట్టేసింది. ఆ చిత్రం కూడా అంతంత మాత్రంగానే ఆడింది.
-
- ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు ఈ బ్యూటీ. ఆ మధ్య హర్యానా మాజీ సీఎం మనవడితో ఎంగేజ్మెంట్ చేసుకుని వార్తల్లో నిలిచింది. కానీ పెళ్లి వరకు వెళ్లకముందే వీళ్ల రిలేషన్షిప్ మధ్యలోనే ఆగిపోయింది. ఇదిలా ఉంటే ఆమె ఎక్స్‌బాయ్ ఫ్రెండ్‌కి ఇప్పుడు ఇంకో అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
- ఇక మెహ్రీన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో స్పార్క్ అనే చిత్రం చేస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది. దాంతో పాటు కన్నడలోనూ నీ సిగోవరేగు అనే చిత్రంలో నటిస్తోంది మన మహాలక్ష్మి. మరోవైపు ఈ భామ తెలుగు చిత్ర పరిశ్రమలో మరింత బిజీగా ఉంటానని బలంగ చెప్తోంది. ఆమె లేటెస్ట్ ఫొటోల్లో బ్లాక్ కలర్ శారీలో చాలా నాజూగ్గా కనిపిస్తోంది ఈ బ్యూటీ. వామ్ కలర్ లైట్లో చాలా స్లిమ్‌గా అండ్ ప్రిట్టిగా కూడా కనిపిస్తోంది ఈ బ్యూటీ.
-
- ఈ ఫొటోలకు నెటిజన్లు రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే ‘‘ ఎందుకు పాపా ఇంత సన్నగా అయిపోయావ్’’ అంటూ కమెంట్ చేశాడు. మరొకరైతే ఇలా అయిపోయావ్ ఏంటి అంటూ కమెంట్ చేశారు. ప్రస్తుతం ఈ భామ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలకు వానిటీ డైరీస్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది మెహ్రీన్. ఈ లుక్స్‌లో ఆమెకు మరిన్ని ఆఫర్స్ వస్తాయో లేదో చూడాలి మరి.

Ehatv
Next Story