అగ్రశ్రేణి తారాగణంతో, భారీ బడ్జెట్‌లతో సినిమాలు తీసి, తీసి సడన్‌గా కొత్తవారితో లో బడ్జెట్ మూవీ తీయడమంటే అదోలా ఉంటుంది. కానీ పరిస్థితులు ఆ విధంగా ప్రేరేపించినప్పుడు చేయక తప్పదు. మెగాస్టార్ చిరంజీవితో(Chiranjeevi) ఈ మధ్యనే భోళాశంకర్(Bholashankar) అనే సినిమా తీసి భారీగా ట్రోలింగ్‌కు గురైన మెహర్ రమేశ్(Meher Ramesh) పరిస్థితి ఇలాగే తయారయ్యింది. భోళాశంకర్ డిజాస్టర్ కావడమే ట్రోలింగ్‌కు కారణం.
అగ్రశ్రేణి తారాగణంతో, భారీ బడ్జెట్‌లతో సినిమాలు తీసి, తీసి సడన్‌గా కొత్తవారితో లో బడ్జెట్ మూవీ తీయడమంటే అదోలా ఉంటుంది. కానీ పరిస్థితులు ఆ విధంగా ప్రేరేపించినప్పుడు చేయక తప్పదు. మెగాస్టార్ చిరంజీవితో(Chiranjeevi) ఈ మధ్యనే భోళాశంకర్(Bholashankar) అనే సినిమా తీసి భారీగా ట్రోలింగ్‌కు గురైన మెహర్ రమేశ్(Meher Ramesh) పరిస్థితి ఇలాగే తయారయ్యింది. భోళాశంకర్ డిజాస్టర్ కావడమే ట్రోలింగ్‌కు కారణం. అసలు మెహర్ రమేశ్‌తో సినిమా అనగానే చిరంజీవి ఫ్యాన్స్ బెంబేలెత్తిపోయారు. వారు అనుకున్నట్టుగానే అయ్యింది. చిరంజీవి కెరీర్‌లోనే దారుణమైన డిజాస్టర్‌ను ఇచ్చాడు మెహర్ రమేశ్. శక్తి, షాడో వంటి ఆల్ టైమ్ డిజాస్టర్లు తీసిన మెహర్‌రమేశ్‌కు చాన్నాళ్ల పాటు అవకాశాలు రాలేదు. ఎనిమిదేళ్లుగా ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ ఖాళీగా ఉన్న మెహర్‌కు చిరంజీవి అవకాశం ఇవ్వడమేమిటని చాలా మంది డౌట్ పడ్డారు. చిరంజీవి వంటి స్టార్ హీరో పిలిచి అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా పరమ చెత్త సినిమా తీశాడనే అపకీర్తిని మెహర్ రమేశ్ తెచ్చుకున్నాడు. భోళా శంకర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత మెహర్ రమేష్ కెరీర్ ముగిసిపోయిందని, ఇక పరిశ్రమలో తేరుకునే అవకాశమే లేదని వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒక బ్యానర్ నుంచి మెహర్ రమేష్‌కు ఆఫర్ వచ్చిందట.. తక్కువ బడ్జెట్‌లో ఒక సినిమా తీయాలని కోరిందట. అది కూడా అయిదు కోట్ల రూపాయలలోపు ప్రాజెక్టును పూర్తి చేయాలనే షరత్ విధించిందట! ఈ ప్రాజెక్టుకు మెహర్ రమేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట! కొత్త వారితో సినిమా తీసి సూపర్ హిట్ కొట్టేసి మళ్లీ టాలీవుడ్ రేసులో నిలబడాలనే గట్టి పట్టుదలతో మెహర్‌రమేశ్ ఉన్నాడట! భారీ బడ్జెట్‌లతో సినిమాలు తీసే ఆయన ఇలా తక్కువ ఖర్చుతో సినిమాను తీయడం కష్టమే కానీ తప్పదు..