మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) నటించిన తాజా చిత్రం భోళా శంకర్‌(Bhola shankar) మొన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా వారిని పూర్తిగా నిరాశపర్చింది. మొదటి షో నుంచే ఫ్లాప్‌ టాక్‌ వచ్చింది. సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోవడంలో విఫలం చెందింది. దర్శకుడు మెహర్‌రమేశ్‌ను ఫ్యాన్స్‌ బండబూతులు తిడుతున్నారు. భోళాశంకర్‌ పోతే పోయింది. తర్వాతి సినిమా మాత్రం కచ్చితంగా హిట్‌ కొడుతుందన్న నమ్మకాన్ని తెచ్చుకున్నారు అభిమానులు.

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) నటించిన తాజా చిత్రం భోళా శంకర్‌(Bhola shankar) మొన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా వారిని పూర్తిగా నిరాశపర్చింది. మొదటి షో నుంచే ఫ్లాప్‌ టాక్‌ వచ్చింది. సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోవడంలో విఫలం చెందింది. దర్శకుడు మెహర్‌రమేశ్‌ను ఫ్యాన్స్‌ బండబూతులు తిడుతున్నారు. భోళాశంకర్‌ పోతే పోయింది. తర్వాతి సినిమా మాత్రం కచ్చితంగా హిట్‌ కొడుతుందన్న నమ్మకాన్ని తెచ్చుకున్నారు అభిమానులు. చిరంజీవి తర్వాతి సినిమా ఎప్పుడు సెట్స్‌ మీదకు వెళుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బింబిసార(Bimbisara) వంటి సూపర్‌హిట్‌ సినిమాను అందించిన దర్శకుడు వశిష్ట(Vasista)మెగాస్టార్‌కు ఓ కథ వినిపించారట! దానికి చిరంజీవి కూడా ఓకే చెప్పారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. సోషియో ఫాంటసీ(Socio Fantacy) నేపథ్యంలో భారీ గ్రాఫిక్స్‌ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని తెలిసింది. లేటెస్ట్ న్యూస్‌ ప్రకారం నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నారని తెలిసింది.
జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఇన్నేళ్లకు చిరంజీవి నటించబోతున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం. ఈ సినిమాతో పాటు మలయాళ బ్రో డాడీ రీమేక్‌లో చిరంజీవి నటించబోతున్నారు. కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్నది.

Updated On 14 Aug 2023 7:55 AM GMT
Ehatv

Ehatv

Next Story