గెట్ రెడీ మెగా ఫ్యాన్స్.. పూనకాలతో ఊగిపోవడానికి రెడీ అవ్వండి.. చిరంజీవి(Chiranjeevi) భోళా శంకర్(Bhola Shankar) నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతోంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే...?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తోన్న తాజా మూవీ భోళా శంకర్. తమన్నా(Tamanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో కీర్తి సురేష్(Keerthy Suresh) చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది.

గెట్ రెడీ మెగా ఫ్యాన్స్.. పూనకాలతో ఊగిపోవడానికి రెడీ అవ్వండి.. చిరంజీవి(Chiranjeevi) భోళా శంకర్(Bhola Shankar) నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతోంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే...?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తోన్న తాజా మూవీ భోళా శంకర్. తమన్నా(Tamanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో కీర్తి సురేష్(Keerthy Suresh) చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. చాలా గ్యాప్ తరువాత మెహర్‌ రమేశ్‌(Meher Ramesh) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈసినిమా తమిళ సినిమా వేదాళ‌మ్ రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఇప్పటికే భోళా శంకర్‌ నుంచి రిలీజ్ చేయసిన స్టిల్స్‌ సినిమాపై మంచి క్రేజ్ ను భారీగా పెంచేశాయి. ఇక భోళా శంకర్ మ్యూజికల్‌ మేనియా కోసం రెడీ అవుతున్నారు మూవీ టీమ్.

త్వరలోనే ఈ సినిమా నుంచి మ్యూజిక్ జాతర షురూ కానుందంటూ న్యూస్ కూడా షేర్ చేశారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ కు సబంధించి సమాచాంరం అందించారు టీమ్. భోళా శంకర్ సాంగ్‌ ప్రోమోను జూన్‌ 2న, ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను జూన్‌ 4న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్‌. చిరంజీవి స్టైలిష్ గాగుల్స్‌ తో నడుచుకుంటూ వస్తున్న లుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంగ్ ఎప్పుడెప్పుడు విందామా అని మెగా ప్యాన్స్ ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు.

ఇక ఈమూవీ షూటింగ్ జూన్‌ చివరి నాటికి పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి.. త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. అగస్ట్ లో మెగా బర్త్ డే సందర్భంగా ఈసినిమా ను రిలీజ్ చేయబోతున్నారు. మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు ఇక ఈసినిమాలో భోళా శంకర్‌ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.

Updated On 1 Jun 2023 11:22 PM GMT
Ehatv

Ehatv

Next Story