హనుమాన్ సినిమా(Hanuman Movie) కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీ ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రశాంత్ వర్మ(Prashanth Varma)దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో హీరోగా యువ నటుడు తేజా సజ్జా(Teja Sajja) నటిస్తున్నాడు. బడా హీరోలకు పోటీగా సంక్రాంతి బరిలో దిగుతున్నప్పుడే ఈ సినిమాపై ప్రశాంత్ వర్మ ఎంత ధీమాగా ఉన్నారో అర్థమవుతోంది.
హనుమాన్ సినిమా(Hanuman Movie) కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీ ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రశాంత్ వర్మ(Prashanth Varma)దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో హీరోగా యువ నటుడు తేజా సజ్జా(Teja Sajja) నటిస్తున్నాడు. బడా హీరోలకు పోటీగా సంక్రాంతి బరిలో దిగుతున్నప్పుడే ఈ సినిమాపై ప్రశాంత్ వర్మ ఎంత ధీమాగా ఉన్నారో అర్థమవుతోంది. ట్రైలర్ చివరలో భజరంగ్ ఎంట్రీ షాట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా హనుమంతుడు కండ్లు తెరిచే సన్నివేశం రోమాలను నిక్కబొడిపించింది. ఇది చూశాక క్లైమాక్స్‌లో కొద్ది నిమిషాల పాటు హనుమంతుడి దర్శనం ఉంటుందని అనిపిస్తోంది. ఈ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeeevi) నటించారని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వార్తలో నిజానిజాలేమిటో తెలియదు కానీ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఈ వార్ బాగా వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయుడి వీర భక్తుడన్న సంగతి తెలిసిందే. అవకాశం దొరికినప్పుడల్లా హనుమంతుడిపై తన భక్తిని చాటుకుంటుంటాడు. తన సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిన చిత్రాలలో జగదేకవీరుడు అతిలోకసుందరి ఒకటి. ఈ సినిమాలో చిరంజీవి కాసేపు హనుమంతుడిలా కనిపిస్తాడు. అలాగే యానిమేషన్ సినిమా హనుమాన్‌లోనూ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. వీటన్నింటినీ చూస్తే హనుమాన్‌లోనూ ఆంజనేయుడి పాత్రలో చిరంజీవి నటించే ఉంటారనే నమ్మకం కలుగుతోంది. అయితే ఇది నిజమా? వట్టి వదంతేనా అన్నదాంట్లో మాత్రం క్లారిటీ రాలేదు. హనుమంతుడి పాత్రలో ఎవరు నటించారనే విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా రివీల్ చేయలేదు. ఆ పాత్ర చేసింది ఎవరో సినిమా చూసే తెలుసుకోవాలన్నాడు.