అగ్ర కథానాయకుడు మెగాస్టార్ డా. చిరంజీవికి హౌస్ ఆఫ్ కామన్స్, యూకే పార్లమెంట్‌లో గౌరవ సత్కారం జరగనుంది.
అగ్ర కథానాయకుడు మెగాస్టార్ డా. చిరంజీవికి హౌస్ ఆఫ్ కామన్స్, యూకే పార్లమెంట్‌లో గౌరవ సత్కారం జరగనుంది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవిని మార్చి 19న సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా, ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు.
బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ఓ ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు, వారు సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తోంది. దాన్ని చిరంజీవి అందుకోనుండటం విశేషం. ఇది ఆయన కీర్తి కీరటంలో మరో కలికితురాయిగా నిలుస్తుంది. యు.కె కు చెందిన పార్లమెంట్ సభ్యులు, బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీని సన్మానించడ, ఆయనకు లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డ్ ఇవ్వటం అనేది ప్రత్యేకమైన సందర్భం. 2024లో భారత ప్రభుత్వం నుంచి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను చిరంజీవి గారు అందుకున్నారు. అలాగే గత ఏడాది అత్యంత సమర్ధవంతమైన నటుడు, డ్యాన్సర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌తో సత్కరించబడ్డారు.
