చాన్నాళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన వరుణ్‌ తేజ్‌(VarunTej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)లు తర్వలో పెళ్లిబంధంతో ఒక్కటి కాబోతున్నారు. జూన్‌లో నిశ్చితార్థాన్ని వైభవంగా జరుపుకున్న వీరిద్దరు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.ఇప్పటికే పెళ్లి పనులు జోరందుకున్నాయి. నవంబర్‌ 1వ తేదీ నుంచి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారు.

చాన్నాళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన వరుణ్‌ తేజ్‌(VarunTej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)లు తర్వలో పెళ్లిబంధంతో ఒక్కటి కాబోతున్నారు. జూన్‌లో నిశ్చితార్థాన్ని వైభవంగా జరుపుకున్న వీరిద్దరు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.ఇప్పటికే పెళ్లి పనులు జోరందుకున్నాయి. నవంబర్‌ 1వ తేదీ నుంచి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. ఇటలీ(Italy)లోని ఓ ప్యాలెస్‌లో పెళ్లి వేడుక జరగబోతున్నది. దీనికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం వరుణ్‌, లావణ్యల ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ను కుటుంబసభ్యులు ప్రారంభించారు. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ట్విట్ట‌ర్ వేదికగా వెల్లడించాడు. ఈ సంబరంలో చిరంజీవి-సురేఖ(Chiranjeevi - Surekha) దంపతులు, రామ్ చరణ్ -ఉపాసన(Ram Charan - Upasana) దంపతులు, నాగ‌బాబు-పద్మజ(Nagababu - Padmaja) దంపతులు, చిరంజీవి తల్లి అంజనాదేవి(Anjanadevi), చిరంజీవి ఇద్దరు చెల్లెలు, వారి భర్తలు, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల, నిహారిక కొణిదెల, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా పాల్గొన్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆరేళ్ల కిందట వచ్చిన మిస్టర్‌ సినిమాతో వరుణ్‌, లావణ్యల మధ్య ప్రేమ చిగురించింది.

Updated On 7 Oct 2023 4:46 AM GMT
Ehatv

Ehatv

Next Story