వారసుడు రాబోతుండటంతో.. మెగా ఫ్యామిలీ(Mega Family) ఆనందంలోమునిగి తేలుతోంది. ప్రెగ్నెంట్ తో ఉన్న ఉపాసన(Upasana)ను గాజుబొమ్మలా చూసుకుంటున్నారు కుటుంబం. ఉపాసన(Upasana) కోసం ప్రత్యేకంగా ఓ వంట చేయించారు మెగాస్టార్ మాతృమూర్తి అంజనాదేవి(Anjanadevi). మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెస్సీతో ఉన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆరోనెల గర్బిణిగా ఉన్న ఉపాసన(Upasana) కోసం కుటుంబం అంతా కావల్సిన వంటలు చేసి పెడుతున్నారు. బాంగారు బొమ్మలా చూసుకుంటున్నారు.

Anjana Devi Special Recipe For Upasana
వారసుడు రాబోతుండటంతో.. మెగా ఫ్యామిలీ(Mega Family) ఆనందంలోమునిగి తేలుతోంది. ప్రెగ్నెంట్ తో ఉన్న ఉపాసన(Upasana)ను గాజుబొమ్మలా చూసుకుంటున్నారు కుటుంబం. ఉపాసన(Upasana) కోసం ప్రత్యేకంగా ఓ వంట చేయించారు మెగాస్టార్ మాతృమూర్తి అంజనాదేవి(Anjanadevi).
మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెస్సీతో ఉన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆరోనెల గర్బిణిగా ఉన్న ఉపాసన(Upasana) కోసం కుటుంబం అంతా కావల్సిన వంటలు చేసి పెడుతున్నారు. బాంగారు బొమ్మలా చూసుకుంటున్నారు. అటు చరణ్(Ram Charan) కూడా ఉపాసన కోరుకున్న చోటుకి తీసుకెళ్తూ.. ఆమెతో టైమ్ ను సరదాగా గడిపేస్తున్నాడు. అటు శంకర్ తో చేస్తున్న గేమ్ చేంజర్ మూవీని పక్కన పెట్టిన మరీ ఉపాసన తో టైమ్ ను గడుపుతున్నాడు రామ్ చరణ్(Ram Charan).
ఈ నేపథ్యంలో చిరంజీవి (Chiranjeevi) తల్లి అంజనా దేవి (Anjana Devi).. ఉపాసన(Upasana) కోసం ఓ ప్రత్యేకమైన వంటకాన్ని తయారు చేశారు. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. ‘నాయనమ్మ ప్రేమతో తయారు చేసిన సండే స్పెషల్ పులావ్. ఇంతకంటే ఇంకేం అడగాలి’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మెగా ఫ్యామిలీ అంతా ఎప్పుడెప్పుడు వారసుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో ఉపాసన కూడా ప్రత్యేకమైన డైట్ ను ఫాలో అవుతూ.. ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నానమ్మ ఉపాసన కోసం ఇలా స్పెషల్ పులావ్ వండారు. ఈ వీడియోలో దగ్గరుండి.. అందులో కావల్సిన ఐటమ్స్ వేయిస్తూ.. కనిపించారు అంజనా దేవి. ఇక ఈ వీడియో చూసి మెగా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. రకరకాలు కామెంట్లు చేస్తున్నారు.
Sunday Pulao made with loads of love ❤️. What more can I ask for. 🤗🤗🤗 pic.twitter.com/EegIdtsU80
— Upasana Konidela (@upasanakonidela) April 16, 2023
