మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నుంచి తాజాగా రాబోతున్న సినిమా బోళాశంకర్(Bhola Shankar). మోహర్ రమేష్(Meher Ramesh) డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా షూటింగ్ పార్ట్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు టీమ్. తమన్నా(Tamannaah)హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈసినిమా పోష్ట్ ప్రొడక్షన్ లో భాగంగా.. బోళా శంకర్ లో తన పాత్రకు డబ్బింగ్ కంప్లీట్ చేసినట్టు ప్రకటించారు చిరు.

ఫ్యాన్స్ కోసం మంచి అప్ డేట్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), భోళాశంకర్(Bhola Shankar) హడావిడిలో ఉన్న ఆయన.. ఆ సినిమాపై సాలిడ్ అప్ డేట్ ఇచ్చాడు.

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నుంచి తాజాగా రాబోతున్న సినిమా బోళాశంకర్(Bhola Shankar). మోహర్ రమేష్(Meher Ramesh) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు టీమ్. తమన్నా(Tamannaah)హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా పోష్ట్ ప్రొడక్షన్ లో భాగంగా.. బోళా శంకర్ లో తన పాత్రకు డబ్బింగ్ కంప్లీట్ చేసినట్టు ప్రకటించారు చిరు. డబ్బింగ్ చెపుతున్న రెండు పోటోలను శేర్ చేస్తూ.. ట్వీట్ చేశారు మెగాస్టార్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ట్వీట్ చేస్తూ.. మెగాస్టార్ ఫ్యాన్స్ కోసం ఓ నోట్ కూడా రాశారు. ఈ సినిమా రూపుదిద్దుకున్న విధానం చాలా సంతృప్తి కలిగించిందని అన్నారు చిరంజీవి. ఈ సినిమా మాస్ విశ్వరూపం ప్రదర్శించడం ఖాయమని, ఆడియన్స్ ను కచ్చితంగా అలరిస్తుందని చిరంజీవి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని, రిలీజ్ డేట్ ను సేవ్ చేసుకోవాలని.. ఇక థియేటర్లలో కలుసుకుందాం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఇక ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. ఇక భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తుండగా.. అక్కినేని హీరో సుశాంత్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. వీరితో పాటు రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మి గౌతమ్, ఉత్తేజ్ తదితరులు బోళాశంకర్ లోసందడి చేయబోతున్నారు.

ఇక తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కింది. తెలుగులో ఈసినిమాను ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం సమకూర్చగా.. మెగా ఫ్యాన్స్ బోళా శంకర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Updated On 6 July 2023 11:44 PM GMT
Ehatv

Ehatv

Next Story