యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భర్త్ డే (Prabhas Birthday) సందర్భంగా సెలబ్రిటీ స్టార్స్ అంతా విషెష్ తెలియజేస్తున్నారు. ఆయన బర్త్ డేను అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేస్తుండగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా రెబల్ స్టార్ ను విష్ చేశారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భర్త్ డే (Prabhas Birthday) సందర్భంగా సెలబ్రిటీ స్టార్స్ అంతా విషెష్ తెలియజేస్తున్నారు. ఆయన బర్త్ డేను అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేస్తుండగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా రెబల్ స్టార్ ను విష్ చేశారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే వేడుకలు ఘనంగా సెలబ్రేట్ చేశారు అభిమానులు. ఇండియాలోనే కాదు.. దేశ విదేశాల్లో కూడా ప్రభాస్ భర్త్ డేను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు సినిమాకు అంతర్జాతీయ గౌరవం తెచ్చిన ప్రభాస్ కు ఇండస్ట్రీ నుంచి కూడా వరుసగా పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుతున్నాయి. .

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక గా రెబల్ స్టార్ ప్రభాస్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే మై డియర్ ప్రభాస్, మీకు అద్భుతమైన సంవత్సరం రాబోతుంది. మీరు కొత్త శిఖరాలను అధిరోహించండి మరియు మీ కీర్తిని మరింత విస్తరించండి అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ప్రభాస్ బర్త్ డేను దేశ విదేశాల్లో కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. జపాన్ లో ముందు రోజే ప్రభాస్ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఫ్యాన్స్. ఆయన ఫోటోలకు స్పెషల్ గా పూజలు కూడా నిర్వహించారు. ఆయనపై వారికి ఉన్న అభిమానం చాటుకున్నారు. ఇక హైదరాబాద్ లో సలార్ టీమ్ తో కలిసి ప్రభాస్ భారీ కటౌట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు.

ప్రభాస్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న సలార్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుండగా... నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీగా కల్కి 2898AD మూవీ రూపొందుతోంది. ఇక మరికొన్న భారీ బడ్జెట్ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Updated On 23 Oct 2023 5:28 AM GMT
Ehatv

Ehatv

Next Story