Sr.NTR centenary celebrations : చిరంజీవి, మోహన్‌బాబులకు అందని ఆహ్వానం
నందమూరి తారక రామారావు(Nandhamuri Tharaka Rama Rao) శత జయంతి ఉత్సవాలను శనివారం రోజున ఘనంగా నిర్వహించబోతున్నారు. ఆల్‌రెడీ సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. కాకపోతే ఆ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), కలెక్షన్ కింగ్ మోహన్‌బాబులకు(Mohan babu) చోటు దక్కలేదు. కేవలం చంద్రబాబు(Chandhrababu) భజనపరులకు మాత్రమే ఆహ్వానం లభించిందని కొందరు విమర్శిస్తున్నారు.
నందమూరి తారక రామారావు(Nandhamuri Tharaka Rama Rao) శత జయంతి ఉత్సవాలను శనివారం రోజున ఘనంగా నిర్వహించబోతున్నారు. ఆల్‌రెడీ సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. కాకపోతే ఆ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), కలెక్షన్ కింగ్ మోహన్‌బాబులకు(Mohan babu) చోటు దక్కలేదు. కేవలం చంద్రబాబు(Chandhrababu) భజనపరులకు మాత్రమే ఆహ్వానం లభించిందని కొందరు విమర్శిస్తున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన పవన్ కల్యాణ్(Pawan Kalyan), వెంకటేశ్(Venkatesh), జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR), అల్లు అర్జున్(Allu Arjun), ప్రభాస్(Prabhas), సుమన్(Suman), మురళీమోహన్(Murali Mohan), నందమూరి కల్యాణ్‌రామ్(Nandhmuri Kalyan), జయప్రద(Jayapradha), రాఘవేంద్రరావు(Raghavendra Rao), అశ్వనీదత్(Ashwani dat), ఆదిశేషగిరిరావు(Adhishesha Giri Rao) తదిరులకు మాత్రమే ఇన్విటేషన్లు వెళ్లాయని ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్ధన్ తెలిపారు. ఇందులో కూడా రాజకీయాలే చోటు చేసుకున్నాయని కొందరు రుసరుసలాడుతున్నారు. అశ్వనీదత్ తెలుగుదేశం పార్టీకి చెందిన వారన్న సంగతి బహిరంగరహస్యమే! పైగా ఈ మధ్య జగన్ ప్రభుత్వంపై కల్పించుకుని మరీ విమర్శలు చేస్తున్నారు. పాలిటిక్స్‌లో వస్తే టీఆర్‌ఎస్‌లోనే చేరతానని చెప్పిన సీనియర్ హీరో సుమన్ ఈ మధ్యన చంద్రబాబును తెగ పొగిడేస్తున్నారు.
రాఘవేంద్రరావు, మురళీమోహన్, జయప్రదలు కూడా చంద్రబాబుకు కావాల్సిన వారే! నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారన్న భయంతో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లను ఆహ్వానించారే కానీ ప్రేమతో కాదు. ఇక ప్రభాస్, అల్లు అర్జున్‌లను ఆహ్వానించడం వెనుక కారణాలు వేరు! మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కాబట్టి శతజయంతి ఉత్సవాలకు వస్తారో రారో తెలియదు. జూనియర్ రాకూడదనే చంద్రబాబు మనసులో కోరుకుంటారు. ఇక సీనియర్ ఎన్టీఆర్‌కు మోహన్‌బాబు వీరాభిమాని. ఆయనతో మంచి అనుబంధమే ఉంది. ఎన్‌టిఆర్‌తో సినిమాను నిర్మించిన అనుభవమూ ఉంది. మోహన్‌బాబును పిలిస్తే ఆయన ఎక్కడ నిజాలు మాట్లాడారేమోనన్న భయం ఉంది. అందుకే మోహన్‌బాబుకు ఆహ్వానం పంపలేదు. మరి చిరంజీవిని ఎందుకు పక్కన పెట్టినట్టు అంటే ఆయన జగన్‌తో కాసింత మంచిగానే ఉంటారు కాబట్టి అట!