నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandmuri balakrishna) కుర్రహీరోలతో పోటీపడుతున్నాడు.

నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandmuri balakrishna) కుర్రహీరోలతో పోటీపడుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్‌ కొడుతున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపడ కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. బాలయ్య ప్రత్యేకత ఏమిటంటే టాక్‌ షో హోస్ట్‌గా(Talk Show host) కూడా సక్సెస్‌ సాధించడం. చాలా తక్కువ మంది హీరోలకే ఈ ఖ్యాతి లభిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో(Aha) స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్(Unstopable) షోతో తన తడాఖాను చూపించాడు. ఆ టాక్‌ షో సక్సెసయ్యిందంటే అందుకు కారణం బాలకృష్ణనే! ఇంకెవరు ఉన్నా అది ఈ రేంజ్‌లో హిట్టవ్వకపోయేది. ఈ విషయాన్ని మిగతా హీరోల అభిమానులు కూడా ఒప్పుకుంటారు. అన్‌స్టాపబుల్ షోకు ఇప్పటి వరకు చాలా మంది హీరోలు వచ్చారు. యంగ్‌ హీరోలు వచ్చారు. కుర్ర హీరోలతో కలిసి బాలయ్య కూడా యంగ్‌ హీరోగా మారిపోయాడు. వారితో బాలయ్య చేసిన రచ్చ మామూలుగా లేదు. పవన్‌కల్యాణ్‌(Pawan kalayn), మహేశ్‌బాబు(Mahesh babu), అల్లు అర్జున్‌(allu arjun), ప్రభాస్‌(Prabhas) ఇలా చాలా మంది ఈ టాక్‌ షోకు వచ్చారు. వారితో బాలయ్య చేసిన సంభాషణలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షో ఇప్పుడు సీజన్ ఫోర్‌కు సిద్ధం అవుతోంది. త్వరలోనే సీజన్ ఫోర్‌ను ప్రారంభించనున్నారు. ఈసారి కూడా ఈ టాక్ షోకు సూపర్ సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయి. ఈసారి గ్యారంటీగా ఈ షోకు మెగాస్టార్‌ చిరంజీవి(Mega star chiranjeevi) గెస్ట్‌గా రాబోతున్నారట! మూడు సీజన్స్ నుంచి చిరంజీవి వస్తారని వార్తలు వచ్చాయి. మెగా అభిమానులు, నందమూర్తి ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూశారు కానీ చిరంజీవి రాలేదు. ఈసారి మాత్రం పక్కా అని అంటున్నారు. త్వరలో రాబోతున్న విశ్వంభర సినిమా విశేషాలతో పాటు ఆయన లైఫ్ లోని ముఖ్యమైన విషయాలను కూడా బాలయ్యతో, అభిమానులతో చిరంజీవి పంచుకోనున్నారని అంటున్నారు. అలాగే ఇదే సీజన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గెస్ట్‌గా హాజరవుతాడని చెబుతున్నారు. ఇక ఫ్యాన్స్‌కు పండగే పండుగ!

Eha Tv

Eha Tv

Next Story