ఈమధ్య రీరిలీజ్(Re-release) ల ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఇక మెగాస్టార్ సినిమాలు కూడా వరుసగా రీ రిలీజ్ కు సై అంటున్నాయి.

ఈమధ్య రీరిలీజ్(Re-release) ల ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఇక మెగాస్టార్ సినిమాలు కూడా వరుసగా రీ రిలీజ్ కు సై అంటున్నాయి. తాజాగా మెగా ఫ్యాన్స్ కోసం చిరంజీవి(Chiranjeevi) సూపర్ హిట్ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.

గెట్ రెడీ మెగా ఫ్యాన్స్.. మీకోసం అదరిపోయే సర్ ప్రైజ్ రెడీ అవుతోంది. మెగా ఫ్యాన్స్ కోసం చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీని మరోసారి రిలీజ్ చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా నటించి మెప్పించిన శంకర్ దాదా ఎంబీబీఎస్(Shankar dada MMBS ) సినిమాను రీరిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ నటించిన చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.. అవుతూనే ఉన్నాయి. ఈక్రమంలో

మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను రీరిలీజ్ చేస్తారంటూ గత ఆగస్టు నుంచి ప్రచారం జరుగుతుండగా.. తాజాగా రీరిలీజ్ కు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 4న శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాను థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నట్లు బీఏ రాజు టీమ్ అధికారికంగా ప్రకటించింది.

హిందీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ గా వచ్చిన సినిమాను తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ గా తెరకెక్కించగా.. మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా అందాల భామ సోనాలీ బింద్రే(Sonali Bindhre) నటించింది. ఈ ఇద్దరి కాంబో అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చూపించిన కామెడీ టైమింగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. బాస్ కు ముఖ్య అనుచరుడిగా, ఏటీఎం(ATM) పాత్రలో శ్రీకాంత్(Srikanth) సరిగ్గా ఒదిగిపోయారు. దీంతో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా మరోమారు థియేటర్లలో సందడి చేయనుంది.

Updated On 17 Oct 2023 12:56 AM GMT
Ehatv

Ehatv

Next Story