బాలీవుడ్‌తో(bollywood) పోలిస్తే టాలీవుడ్(tollywood)లో మల్టీస్టారర్లు తక్కువే! ఒకప్పుడైతే హీరోలు ఎలాంటి భేషజాలకు పోకుండా మరో హీరోతో నటించేవారు
బాలీవుడ్‌తో(bollywood) పోలిస్తే టాలీవుడ్(tollywood)లో మల్టీస్టారర్లు తక్కువే! ఒకప్పుడైతే హీరోలు ఎలాంటి భేషజాలకు పోకుండా మరో హీరోతో నటించేవారు. ఇప్పుడు ఓ ఎపిక్ మల్టీస్టారర్ రాబోతున్నది. మెగా అభిమానులకు ఇంతకు మించిన శుభవార్త మరోటి ఉండదు.. మెగాస్టార్ చిరంజీవి(mega star chiranjeevi),పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్(power star pawan kalyan),గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్(global star ram charan)లు కలిసి ఓ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? కన్నుల పండుగగా ఉండదూ! అసలు ఇది సాధ్యమేనా? ముగ్గరు కలిసి నటిండచం కుదిరే పనేనా? చాలా మంది దర్శకులు అనుకుని ఉంటారు. రచయితలు కూడా కథ రాయడానికి ప్రయత్నించే ఉంటారు. అయితే దర్శకుడు హరీశ్ శంకర్‌కు(Director Harish Shankar)ఈ ఆలోచన రావడమే ఆలస్యం ఓ కథ కూడా రాసేసుకున్నారు. చిరంజీవి, పవన్, రామ్‌చరణ్ హీరోలుగా ఓ సినిమా అనుకున్నానని, ఓ లైన్ ఎప్పట్నుంచో వర్క్ చేసి పెట్టుకున్నానని, అది వర్క్ అవుటైతే మాత్రం అదే పెద్ద పాన్ ఇండియా సినిమా(pan india movie)అవుతుందని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. చాలా ఏళ్ల కిందట చిరంజీవి, పవన్ కల్యాణ్‌లతో త్రివిక్రమ్ (trivikram)దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేశారు నిర్మాత సుబ్బరామిరెడ్డి(subbaramireddy). తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ ప్రాజెక్టు ఏ మాత్రం ముందుకు కదలలేదు. హరీశ్ శంకర్ అనుకున్న సినిమా అయినా కార్యరూపం దాలిస్తే బాగుండునని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు.