అనుకున్నదొక్కటి.. అయ్యింది మరొక్కటి.. వరుసగా సినిమాలు చేస్తున్నాడు కాని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సాలిడ్ హిట్ అందుకోలేకపోతున్నాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. యావరేజ్ హిట్లు కాని.. ప్లాప్ లు కాని పడుతున్నాయి. ఈక్రమంలో తాజాగా భోళా శంకర్ కూడా పెవిలీయన్ చేరడంతో.. ఆయన తీవ్ర నిరాశలో ఉన్నాడు.

అనుకున్నదొక్కటి.. అయ్యింది మరొక్కటి.. వరుసగా సినిమాలు చేస్తున్నాడు కాని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సాలిడ్ హిట్ అందుకోలేకపోతున్నాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. యావరేజ్ హిట్లు కాని.. ప్లాప్ లు కాని పడుతున్నాయి. ఈక్రమంలో తాజాగా భోళా శంకర్ కూడా పెవిలీయన్ చేరడంతో.. ఆయన తీవ్ర నిరాశలో ఉన్నాడు. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకోబోతున్నాడట చిరు. ఓ రెండు నెలల తరువాతే మళ్ళీ నెక్ట్స్ సినిమాల గురించి ఆలోచిస్తాడంటున్నారు. ఇక ఈక్రమంలో మెగాస్టార్ కు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి ని 'భోళాశంకర్(Bhola Shankar) మూవీ తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ సంగతి అందరికి తెలిసిందే. అటు మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో తీవ్ర నిరాశలో ఉన్నారు. తమన్నా(Tamannaah) హీరోయిన్ గా.. కీర్తి సురేశ్(Keerthy suresh), సుశాంత్(sushanth), శ్రీముఖి(Srimukhi), రష్మి(Rashmi), వెన్నెల కిశోర్(venela kishore) తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈసినిమా రీసెంట్ గా ఈ నెల 11న విడుదలయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది.

ఈ సినిమాకు చిరంజీవి దాదాపుగా 55 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఈ మొత్తాన్ని రిలీజ్ కు ముందే చిరంజీవికి నిర్మాత ఇచ్చేశారట. ఇందులో 10 కోట్లకు చెక్ ఇచ్చారట. అయితే సినిమాకు నష్టాలు రావడంతో... 10 కోట్ల చెక్ ను చిరంజీవి వెనక్కి ఇచ్చేశారని న్యూస్ వైరల్ అవుతోంది. . మరోవైపు ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. ఆగస్ట్ 25న హిందీ వర్షన్ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ తాజాగా వెల్లడించింది. అంతే కాదు ఈసినిమా హిందీ వర్షన్ లో చిరంజీవి పాత్రకు ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ డబ్బింగ్ చెప్పినట్టు సమాచారం.

ఇక తమిళంలో అజిత్ నటించి... సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు బోళాశంకర్ తెలుగు రీమేక్. మెహార్ రమేష్ వరుస ఫెయిల్యూర్స్ తరువాత చాలా గ్యాప్ ఇచ్చి చేసిన సినిమా ఇది. కాని ఈసినిమా కూడా ఆయన్ను నిరాశపరిచింది. ఇక మెగాస్టార్ తో సినిమా చేయడానికి ముగ్గరు దర్శకులు రెడీగా ఉన్నారు. మూడు కథలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే నవంబర్ లో చిరంజీవి కొత్త సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారో చూడాలి.

Updated On 19 Aug 2023 8:24 AM GMT
Ehatv

Ehatv

Next Story