అక్కినేని కుటుంబం(Akkineni family), సమంతపై(Samantha) నిన్న మీడియా ఎదుట బహిరంగ విమర్శలు చేసిన కొండా సురేఖపై(Konda surekha) ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది.
అక్కినేని కుటుంబం(Akkineni family), సమంతపై(Samantha) నిన్న మీడియా ఎదుట బహిరంగ విమర్శలు చేసిన కొండా సురేఖపై(Konda surekha) ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇండస్ట్రీ పెద్దా, చిన్నా అన్న తేడా లేకుండా రియాక్టవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా ఘాటుగానే స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో పోస్టు చేస్తూ 'గౌరవనీయమైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. సెలబ్రిటీలు, సినీ సోదరుల సభ్యులను నిందిస్తే, త్వరగా పాపులరు అవుతామని ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సిగ్గుచేటు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటల దాడులను చిత్ర పరిశ్రమగా మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తాం. సంబంధం లేని వ్యక్తులను, అంతకుమించి మహిళలను తమ రాజకీయాల్లోకి లాగడం, అసహ్యకరమైన కల్పిత ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ మైలేజ్ పొందడానికి ఎవరూ ఈ స్థాయికి దిగజారకూడదు. సమాజంలో జీవించడానికి మంచి ప్రదేశంగా మార్చడానికి మా నాయకులను ఎన్నుకుంటాం. రాజకీయాలను కలుషితం చేయకూడదు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు మంచి ఉదాహరణగా ఉండాలి. సంబంధిత వ్యక్తులు సవరణలు చేస్తారని, ఈ హానికరమైన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుంటారని నమ్ముతున్నా' అంటూ చిరంజీవి ఘాటుగా స్పందించారు.