మంచి మనసు చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా ఆదుకోవడానికి ముందుంటున్న చిరంజీవి.. మరోసారి మరో ఆర్టిస్ట్ కు కష్టం రాగానే ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

మంచి మనసు చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi). ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా ఆదుకోవడానికి ముందుంటున్న చిరంజీవి.. మరోసారి మరో ఆర్టిస్ట్ కు కష్టం రాగానే ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రస్తుతం పెద్దదిక్కులా మారారు మెగాస్టార్ చిరంజీవి. ఎవరు కష్టంలో ఉన్నా వెంటనే స్పందిస్తున్నారు. మన తెలుగు వారు అనే కాదు.. ఇతర భాషల్లో నటులకు కూడా చేయూతనందించారు చిరు. చాలా సినిమాల్లో తనకు విలన్ గా నటించి పొన్నంబలం ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. వెంటనే అపోలోలో(apollo) చేర్పించి.. 40 లక్షల విలువైన వైద్యాన్ని రూపాయి ఖర్చులేకుండా చేయించారు. పరిశ్రమలో ఎవరైనా అనారోగ్యంతో బాధ పడుతున్నారనే వార్త తెలిస్తే.. చాలు ఆయనకు వెంటనే తన ఆపన్న హాస్తం అందిస్తారు చిరంజివి. ఈమధ్యనే తమి నటి పాకీజాను కూడా ఆర్థికంగా ఆదుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది జీవితాలు ఆగిపోకుండా..మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నారు. ఇక తన ఫ్యాన్స్ లో ఎంత మందికి ప్రాణదానం చేశారో లెక్కే లేదు.

ఇక తాజగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు మెగాస్టార్. బలగం(balagam) సినిమాతో బాగా ఫేమస్ అయిన గాయకుడు నటుడు మొగిలయ్య(Mogilaya) అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఆయన్ను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు చిరంజీవి. బలగం సినిమాద్వారా గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్య తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీలు దెబ్బ తినడం, డయాబెటిస్‌, బ్లడ్‌ ప్రెజర్‌ వంటి సమస్యలు రావడంతో.. ఆయన కంటి చూపు కూడా మందగించింది. వీటికి తోడు ఇటీవలే మొగిలయ్యకు గుండె నొప్పి కూడా రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

మొగిలయ్య కంటిచూపు పోయిందన్న విషయం తెలుసుకున్న మెగాస్టార్.. ఆయన్ను ఆదుకోవడం కోసం ముందుకు వచ్చారు. ఎంత ఖర్చు అయినా మొగిలయ్యకు కంటిచూపు వచ్చేలా చేయాలని.. అందుకు ఎంత ఖర్చు అయినా.. తాను భరిస్తానని బలగం డైరెక్టర్ వేణుకి పోన్ చేసి చెప్పారు చిరంజీవి, మొగిలయ్యకు మళ్ళీ చూపు వచ్చేలా చేయాలని..దాని కోసం అందరం ప్రార్థించాలని మెగాస్టార్ అన్నారు. మోగాస్టార్ తీసుకున్న కీలక నిర్ణయంతె అంతా హర్షం వ్యాక్తం చేస్తుననారు. మెగా ప్యాన్స్ చిరంజీవిని దేవుడిగా కొలుస్తున్నారు. ఈ సాయానికి సబంధించిన విషయాన్ని డైరెక్టర్ వేణు మొగిలయ్య దృష్టికి తీసుకెళ్లారుట. దాంతో మెగియల్య కూడా చిరుకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

బలగం సినిమాలో క్టైమాక్స్ సీన్ లో కనిపిస్తారు మెగిలయ్య దంపతులు. అప్పుడు వచ్చే పాటను వారు ఆలపించారు. ఈ పాట మూవీకి బలాన్ని ఇచ్చింది. క్లైమాక్స్ లో వచ్చే ఈ పాట అందరిని కంటతడి పెట్టించింది. సినిమా సక్సెస్ లో ఈ పాట భాగం అయ్యింది. ఇక మెగిలయ్య పరిస్థితి తెలిసి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ కూడా స్పందించారు. మెగిలయ్య వైద్యానికి ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం భరిస్తుందన్నారు.

Updated On 18 April 2023 4:28 AM GMT
Ehatv

Ehatv

Next Story