మెగాస్టార్ చిరంజీవి అమెరికాకు బయలుదేరారు. ప్రస్తుతం తన తాజా చిత్రం 'విశ్వంభర' షూటింగ్
మెగాస్టార్ చిరంజీవి అమెరికాకు బయలుదేరారు. ప్రస్తుతం తన తాజా చిత్రం 'విశ్వంభర' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన రెండు వారాల పాటు షూటింగ్ లో బిజీగా గడిపారు. తాజాగా షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చిన ఆయన.. తన భార్య సురేఖతో కలిసి హాలిడే ట్రిప్ కు అమెరికాకు బయల్దేరారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా స్వయంగా వెల్లడించారు. తన అర్ధాంగి సురేఖతో కలిసి షార్ట్ హాలిడే కోసం అమెరికాకు వెళ్తున్నానని చిరు చెప్పారు. యూఎస్ నుంచి వచ్చిన వెంటనే 'విశ్వంభర' షూటింగ్ లో పాల్గొంటానని తెలిపారు.
‘విశ్వంభర’ సినిమాను బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను కన్ఫార్మ్ చేశారు. త్వరలోనే చిరు, త్రిషల మధ్య ఓ డ్యూయెట్‌ని కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెన్స్‌లో చిరంజీవితో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి గెటప్ కూడా కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది.