మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) భోళా శంకర్(Bhola Shankar) సెట్ లో.. ఆస్కార్ సందడి చేసింది. ఇండస్ట్రీ మంచి చెడులలో ఎప్పుడూ ముందుండే చిరంజీవికి తనకు వచ్చిన ఆస్కార్ ను చూపించారు చంద్రబోస్. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇండస్ట్రీలో ప్రతీ విషయంలో ఆయన ఆలోచన ఉండాల్సిందే. మంచి, చెడులకు ముందుంటూ.. ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంటూ వచ్చారు మెగాస్టార్.

మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) భోళా శంకర్(Bhola Shankar) సెట్ లో.. ఆస్కార్ సందడి చేసింది. ఇండస్ట్రీ మంచి చెడులలో ఎప్పుడూ ముందుండే చిరంజీవికి తనకు వచ్చిన ఆస్కార్ ను చూపించారు చంద్రబోస్. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇండస్ట్రీలో ప్రతీ విషయంలో ఆయన ఆలోచన ఉండాల్సిందే. మంచి, చెడులకు ముందుంటూ.. ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంటూ వచ్చారు మెగాస్టార్. దాంతో ప్రతీ ఆర్టిస్ట్.. మాతో సంబంధం లేకుండా. తమ కష్టసుఖాలను చిరంజీవితో పంచుకుంటారు. రీసెంట్ గా ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్ ను రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా తన ఇంట్లో సన్మానించారు చిరంజీవి. ఈ పార్టీలో రాజమౌళి, కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కార్తికేయ లను కూడా చిరు శాలువాతో సత్కరించారు. కాని ఈ ఈవెంట్ లో మిస్ అయ్యారు చంద్రబోస్.

ఈ క్రమంలో... నాటు నాటు పాట(Natu Natu Song) రాసి.. ఆస్కార్(Oscar) లో భాగం అయిన చంద్రబోస్ ని (Chandrabose) మెగాస్టార్ ఆత్మీయంగా సన్మానించారు. భోళా శంకర్ మూవీ సెట్స్ లో.. చిరంజీవినికలిసిన చంద్రబోస్.. తన ఆస్కార్ ను మెగాస్టార్ చేతిలో పెట్టారు. ఎంతో సంతోషించిన చిరంజీవి.. మూవీ టీమ్ సమక్షంలో చిరంజీవి, చంద్రబోస్ కి శాలువా కప్పి చిరు సత్కారం చేశాడు. చంద్రబోస్ తన ఆస్కార్ ని చిరు చేతులకు అందించగా, దానిని పట్టుకొని గర్వంగా ఫీల్ అయ్యాడు మెగాస్టార్.

అంతే కాదు ఈ ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు మెగాస్టార్.. తెలుగు భాషకి ఆస్కార్ తెచ్చినందుకు చంద్రబోస్ ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక చిరంజీవి సినిమా విషయానికి వస్తే.. తమిళ హిట్ సినిమా వేదాళంకి రీమేక్ గా.. భోళాశంకర్ సినిమా తెరకెక్కుతోంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాతో చిరంజీవి జోడీగా మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah)నటిస్తుంది. కీర్తి సురేష్ (Keerthy Suresh) చిరంజీవికి చెల్లిగా కనిపించబోతుంది. అక్కినేని హీరో సుశాంత్ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు.

వరుసగా రెండు హిట్లు అందుకున్న చిరంజీవి.. భోళా శంకర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. రిలీస్ కు పెద్దగా టైమ్ లేదు కాబట్టి.. షూటింగ్ నిర్విరామంగా జరుపుకుంటున్నారు. ఇక ఇంతకీ ఈసినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందంటే.. ఆగష్టు 11న రిలీజ్ కు ముస్తాబవుతుంది.

Updated On 31 March 2023 12:07 AM GMT
Ehatv

Ehatv

Next Story