నిన్న (డిసెంబర్ 22) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్య సంచలనంగా మారింది ప్రభాస్(Prabhas) సలార్(Salaar) సినిమా. ఈమూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దాంతో పలువురు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నిన్న (డిసెంబర్ 22) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్య సంచలనంగా మారింది ప్రభాస్(Prabhas) సలార్(Salaar) సినిమా. ఈమూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దాంతో పలువురు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కన్నడ స్టార్ డైరెక్టర్.. కెజియఫ్ ఫెమ్ ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వంలో.. యగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతీ హాసన్(Shruti Haasan) హీరోయిన్ గా నటించగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్స్ గా నటించారు. శ్రియారెడ్డి, ఈశ్వరరావు లాంటి ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషించారు.

సలర్ ఫస్ట్ పార్ట్ మూవీకి భారీ స్పందన వచ్చింది. భారీగా వసూళ్లు కూడా సాధించారు. అయితే ఈమూవీపై సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీకి సక్సెస్ టాక్ రావడంతో.. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సలార్ టీంని అభినందిస్తూ ఒక ట్వీట్ చేశారు.

మై డియర్ ప్రభాస్ నీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సలార్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేస్తున్నాను.ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ అందించిన ప్రశాంత్ నీల్ కి అభినందనలు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబుకి నా ప్రేమని తెలియజేస్తున్నాను. ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హోంబలే ఫిలింస్ సలార్ తో మారో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఇక ఈమూవీ రిలీజ్ రోజు హీరో నిఖిల్ ఫ్యాన్స్ కు 100 టికెట్లు పంచి పెట్టగా.. బెనిఫిట్ షో చూసి. శ్రీవిష్ణు లాంటి మిరికొందరు కుర్రహీరోలో విజిల్స్ వేస్తూ.. థియేటర్ లో డాన్స్ లు చేస్తూ.. ఎంజాయ్ చేయడం కనిపించింది.
వరుస ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్న ప్రభాస్ హ్యాట్రిక్ ప్లాప్ ల తరువాత సలార్ తో హిట్ కొట్టాడు. చాలా కాలం తరువాత ఒక మాస్ బొమ్మ పడటంతో ప్రభాస్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు.

Updated On 23 Dec 2023 5:31 AM GMT
Ehatv

Ehatv

Next Story