మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) నటిస్తున్న భోళా శంకర్(Bhola Shankar) హంగామా మొదలయ్యింది. దాంతో పాటే చిరంజీవి మేనియా కూడా! మెగా ఫ్యాన్స్ అందరూ అదిరే స్టైలయ్యా అంటూ పాటెత్తుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పాటే మారుమోగుతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్(AK Entertainments) పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్నారు.

Bhola Shankar First Song
మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) నటిస్తున్న భోళా శంకర్(Bhola Shankar) హంగామా మొదలయ్యింది. దాంతో పాటే చిరంజీవి మేనియా కూడా! మెగా ఫ్యాన్స్ అందరూ అదిరే స్టైలయ్యా అంటూ పాటెత్తుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పాటే మారుమోగుతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్(AK Entertainments) పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్నారు. కీర్తి సురేశ్(Keerthy Suresh), సుశాంత్(Sushant)లు ముఖ్య పాత్రలు పోసిస్తున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఆగస్టు 11న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ పనులను ఆల్‌రెడీ మొదలు పెట్టేశారు మేకర్స్. ఇందులో భాగంగానే భోళా మేనియా పాటను విడుదల చేశారు. మహతి స్వరసాగర్ స్వరపరచిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఎల్వీ రేవంత్ పాడారు. ఈ సినిమాల భావోద్వేగాలు, యాక్షన్, హాస్యం సమపాళ్లలో ఉంటాయంటున్నారు దర్శకుడు మెహర్ రమేశ్. అదిరే స్టైలయ్యా .. పగిలే స్వాగ్ అయ్యా అనే పాటలో చిరంజీవి స్టైలిష్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుందట. ఇక చిరంజీవి డాన్స్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంటుంది? రఘుబాబు, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి, సురేఖావాణి, శ్రీముఖి, హైపర్ ఆది ఈ సినిమాలో నటిస్తున్నారు.
