మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) సెకండ్ ఇన్నింగ్స్‌లో దుమ్ము దులుపుతున్నారు. ఏకబిగిన సినిమాలు చేస్తూ అభిమానులను మస్తు ఖుషీ చేస్తున్నారు. వాల్తేర్ వీరయ్య(Waltair Veerayya) సినిమాతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన చిరంజీవి ఇప్పుడు భోళా శంకర్(Bhola Shankar)గా రాబోతున్నారు. ఆగస్టులో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
![Bhola Shankar Bhola Shankar](https://ehatvsite.hocalwire.in/wp-content/uploads/2023/05/Bhola-Shankar-1.jpg)
Bhola Shankar
మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) సెకండ్ ఇన్నింగ్స్‌లో దుమ్ము దులుపుతున్నారు. ఏకబిగిన సినిమాలు చేస్తూ అభిమానులను మస్తు ఖుషీ చేస్తున్నారు. వాల్తేర్ వీరయ్య(Waltair Veerayya) సినిమాతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన చిరంజీవి ఇప్పుడు భోళా శంకర్(Bhola Shankar)గా రాబోతున్నారు. ఆగస్టులో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రామబ్రహ్మం సుంకర(Sunkara Ramabrahmam) నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేశ్(Meher Ramesh) దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేశ్(Keerthy Suresh) నటిస్తున్నారు. ఇటీవల కోల్‌కతా(Kolkata)లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా స్విట్జర్లాండ్(Switzerland)లో మరో షెడ్యూల్‌ను ముగించింది. చిరంజీవి-తమన్నా(Chiranjeevi And Tamannaah Bhatia)లపై ఓ రొమాంటిక్ పాటను చిత్రీకరించారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను కూడా షేర్ చేశారు. ‘‘స్విటర్లాండ్‌లో కళ్లు చెదిరే అందాలతో మైమరపించే లొకేషన్స్‌లో ‘భోళా శంకర’ కోసం తమన్నాతో ఆట పాటలతో ఆహ్లాదంగా జరిగింది. ఈ పాట ప్రేక్షకులందరినీ మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను. త్వరలో మరిన్ని సంగతులు పంచుకుందాం. అప్పటి వరకు ఈ ‘చిరు లీక్స్’ పిక్స్’’ అంటూ ఆ ఫొటోలకు చక్కటి కామెంట్ చేశారు. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారం నుంచి హైదరాబాద్(Hyderabad)లో జరుగుతుంది. ఇందులో కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. జూన్ నెలాఖరుతో షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రంలో సుశాంత్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
![Ehatv Ehatv](/images/authorplaceholder.jpg)