ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలంటే ఓ ప్రత్యేకత ఉంది. మెగా హీరోలంతా ఎంతో ప్రేమతో ఉంటారు. అన్నదమ్ములు.. బాబా బామ్మర్దుల్లా కాకుండా.. స్నేహితుల్లా ఉంటారు. మెగా అన్నదమ్ములు రామ్ చరణ్, వరుణ్ తేజ్ లు కలిసి మెలిసి ఉంటారు. సొంత అన్నాదమ్ముల మాదిరి ఉంటారు. రామ్ చరణ్ సలహాలు సూచనలు తీసుకుంటూ.. అన్నను గౌరవిస్తూ..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) కు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఓసలహా ఇచ్చాడంట. ఇంతకీ సలమా ఏంటంటే..? రీసెంట్ గా ఆయన తన అన్న రామ్ చరణ్ మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలంటే ఓ ప్రత్యేకత ఉంది. మెగా హీరోలంతా ఎంతో ప్రేమతో ఉంటారు. అన్నదమ్ములు.. బాబా బామ్మర్దుల్లా కాకుండా.. స్నేహితుల్లా ఉంటారు. మెగా అన్నదమ్ములు రామ్ చరణ్, వరుణ్ తేజ్ లు కలిసి మెలిసి ఉంటారు. సొంత అన్నాదమ్ముల మాదిరి ఉంటారు. రామ్ చరణ్ సలహాలు సూచనలు తీసుకుంటూ.. అన్నను గౌరవిస్తూ.. వరుణ్ తేజ్ ముందుకు వెళ్తుంటారు. ఇక వరుణ్ తేజ్ ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే చేయకుండా.. కథా బలం ఉన్న సినిమాలు చేస్తూ.. సరికొత్త ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు మెగా ప్రిన్స్. ఈ క్రమంలోనే త్వరలోనే 'గాండీవదారి అర్జున'(Gandeevadhari Arjuna) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు . ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈనెల 25వ తేదీన విడుదల కాబోతోంది. రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీ టీం ప్రమోషన్స్ ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ తన అన్న రామ్ చరణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. మా అన్నయ్య చరణ్ కూడా నేను ఏడవ సినిమా చేస్తున్న సమయంలో నన్ను పిలిచి ఒక మాట చెప్పాడు. ఈ సమయంలో నీకు నచ్చిన సినిమా, నీకు కరెక్ట్ గా అనిపించిన సినిమా, నువ్వు నమ్మిన సినిమా నువ్వు చేసుకుంటూ ఉండు.. ఎవరి ప్రభావం నీ మీద ఉండకూడదు అని అన్నారు. అని వరుణ్ తేజ్ వెల్లడించాడు.
అంతే కాదు ఇప్పుడు ఎలా ఉన్నా.. ఫ్యూచర్ లో నీకు బిజినెస్ తో పాటు మార్కెట్ పెరుగుతుంది. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వస్తారు. కానీ ఎక్కడో చోట నిన్ను ఇలాంటి సినిమానే చేయాలని రిస్ట్రిక్ట్ చేస్తారు. కానీ నువ్వు మాత్రం అలాంటి ట్రాప్ లో పడొద్దు. అది ఫ్యూచర్ లో నీ కెరీర్ మీద ప్రభావం పడుతుంది. నువ్వు చేయాలి అన్న ఆశ ఉన్నా కొన్ని సినిమాలు అప్పుడు చేయలేవు అని సలహా ఇచ్చాడట రామ్ చరణ్.